రక్తంలో షుగర్ లెవల్స్, ఆల్కాహాల్ స్థాయిలు చూసేందుకు కొత్త పరికరం..!

-

రోగలు పెరుగుతున్నాయి.. దాంతో పాటు.. చికిత్స చేసే విధానం, వాడే పరికరాలు కూడా మార్కెట్ లోకి వస్తున్నాయి. తాజాగా యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాన్ డియాగోకు చెందిన ఇంజనీర్లు రక్తంలో చక్కెర, ఆల్కహాల్‌ స్థాయిలని పరిశీలించడానికి “లాబ్ ఆన్ ఎ స్కిన్” (Lab on a skin) సెన్సార్‌ కనుగొన్నారు. ఈ పరికరం ఏంటో, దీని పనితం ఏంటో చూద్దామా..!

డయాబెటీస్‌ పేషెంట్లకు ఈ పరికరం చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది ఒక్కసారి వేస్తే.. రక్తంలో చక్కెర స్థాయిలని ట్రాక్‌ చేసి అలర్ట్‌ చేస్తుంది. వ్యాయామం చేసేటప్పుడు, డ్రింక్స్ తాగేటప్పుడు రక్తంలో చక్కెర పెరగడం, తగ్గడాన్ని ఇది తగ్గిస్తుంది.. స్పష్టమైన నిరంతర బ్లడ్ షుగర్ మానిటరింగ్‌తో పాటు, ఆల్కహాల్ స్థాయిలను గుర్తించి సూచిస్తుంది. డైలీ బ్లడ్ షుగర్ హెచ్చు తగ్గుల వల్ల.. మనకే అర్థమవుతుంది.. ఎలా మెయింటేన్ చేయాలి అని..ఇంకా ఇది వేసుకోవడం కూడా పెద్ద కష్టమైన పని కాదు.

ఆల్కాహాల్ స్థాయి…

డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఆల్కాహాల్ టెస్ట్ చేయడానికి ఒక పరికరం వాడతారు… అది అస్సలు హైజెనిక్ గా అనిపించదు కదా..! ఈ పరికరం ఆల్కహాల్ స్థాయిలను కూడా పర్యవేక్షిస్తుందట.. ఎందుకంటే ఆల్కహాల్ తాగడం వల్ల గ్లూకోజ్ స్థాయిలు తగ్గుతాయి. డయాబెటీస్‌ పేషెంట్లు ఈ రెండు స్థాయిలని గమనించడం చాలా ముఖ్యం. మధుమేహం ఉన్న వ్యక్తులు ఏదైనా పానీయం తీసుకున్న తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు పడిపోకుండా నిరోధించడంలో ఈ పరికరం హెల్ప్ అవుతుంది.

వ్యాయామం సమయంలోనూ…

వ్యాయామం సమయంలో లాక్టేట్ గురించి సమాచారాన్నిఈ మెషిన్ అందిస్తుంది. ఎందుకంటే వ్యాయామం అనేది శరీర సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఈ పరికరం సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీ ఫోన్‌కి అందిస్తూ మిమ్మల్ని అలర్ట్‌ చేస్తుంది. పరిశోధకులు దీనితో ఖచ్చితత్వ ఫలితాలను సాధించారట.

Read more RELATED
Recommended to you

Exit mobile version