ఏపీలో కొత్త జిల్లాలు…’ఎన్టీఆర్’ జిల్లా ఉందా?

-

ఏపీలో జగన్ ప్రభుత్వం ఎప్పుడు ఎలాంటి సంచలన నిర్ణయం తీసుకుంటుందో ఎవరి ఊహకు అందడం లేదు. జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అనేక సంచలన నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే మూడు రాజధానుల నిర్ణయం వచ్చింది…అలాగే మండలి రద్దు కూడా వచ్చింది. కానీ ఇటీవల ఈ రెండు నిర్ణయాలపై యూటర్న్ తీసుకుని జగన్ సంచలనమే సృష్టించారు.

ఇక తాజాగా జగన్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకునే దిశగా ముందుకెళుతున్నట్లు కనిపిస్తోంది. ఇటీవల సీఎం వైఎస్‌ జగన్‌ అధ్యక్షతన జరిగిన ఎంపీల సమావేశంలో ఈ అంశం చర్చకొచ్చింది. ఈ సందర్భంగా కొత్త జిల్లాల ఏర్పాటు, దానికి సంబంధించిన అంశాలపై జగన్ చర్చించినట్లు తెలిసింది. అలాగే కొత్త జిల్లాల ఏర్పాటు ఎంతవరకు వచ్చిందని సీఎం ఆరా తీసినట్లు తెలిసింది. అయితే ఈ కొత్త జిల్లాల టాపిక్ జగన్ ప్రభుత్వం వచ్చినప్పుడే మొదలైంది. . కానీ 2019లో జగన్ సర్కారు ఈ ప్రక్రియను ప్రారంభించించిన తర్వాత కేంద్రం జనాభా గణన కోసం భౌగోళిక ప్రాంతాల విభజనపై నిషేధం విధించింది.

జనాభా గణన ప్రక్రియ పూర్తయ్యేవరకు కొత్త జిల్లాల ఏర్పాటు వీలుకాదు…ఈ ప్రక్రియ ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలియడం లేదు. కానీ జిల్లాల విభజన విషయంలో జగన్ వెనక్కి తగ్గేలా లేరు. ఇప్పటికే ప్రతి పార్లమెంట్ స్థానాన్ని ఒక జిల్లాగా చేస్తానని చెప్పిన విషయం తెలిసిందే. అంటే 25 జిల్లాలు వస్తాయి. అయితే అదనంగా మరో జిల్లా కూడా యాడ్ అవుతుందని, మొత్తం 26 జిల్లాలు చేస్తారని ఎప్పటినుంచో ప్రచారం జరుగుతుంది.

అయితే ఈ క్రమంలోనే జిల్లాల అంశంలో జగన్…పలు హామీలు ఇచ్చారు. గతంలో పాదయాత్ర సమయంలో ఒకో జిల్లాలో ఒకో హామీ ఇచ్చుకుంటూ వచ్చారు. అలాగే కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ జిల్లా అని పేరు పెడతామని హామీ ఇచ్చారు. జిల్లాల విభజన జరిగాక ఈ పేరు పెడతారని ప్రచారం జరిగింది. కృష్ణా జిల్లా రెండుగా విడిపోయాక…ఒక జిల్లాకు ఎన్టీఆర్ జిల్లా అని పేరు పెడతారని చర్చలు వచ్చాయి. మరి జిల్లాల విభజన జరిగాక…ఒకటి ఎన్టీఆర్ జిల్లా అని పేరు పెడతారేమో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version