బ్రేకింగ్ : కొత్త ఎక్సైజ్ విధానాన్ని ప్రకటించిన ఏపీ ప్రభుత్వం  

-

ఏపీ ప్రభుత్వం కొత్త ఎక్సైజ్ విధానాన్ని ప్రకటించింది. ఈ విధానం వచ్చే నెల ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానుంది. కొత్త ఆబ్కారీ విధానంలో కూడా ఏపీలో ప్రస్తుతమున్న 2934 మద్యం దుకాణాలను మరో ఏడాది పాటు కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. అలానే అక్టోబరు 1 తేదీ నుంచి అన్ని మద్యం దుకాణాలు ప్రభుత్వ అధీనంలో ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఇక తిరుపతిలోని అలిపిరి, విష్ణు నివాసం తదితర ప్రాంతాల్లో మద్యం దుకాణాలకు అనుమతి లేదని ప్రభుత్వం మరోమారు స్పష్టం చేసింది. ఈ మేరకు చర్యలు తీసు కోవాలని ఏపీ బేవరెజస్ కార్పొరేషన్ ఎండీని ప్రభుత్వం ఆదేశించింది. ఎక్సైజు కమిషనర్ అనుమతి తో లిక్కర్ మాల్స్ ఏర్పాటుకు కూడా ప్రభుత్వం అవకాశం కల్పించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version