నేను పూజలు చేసాను: బాలయ్య

-

తన గానామృతంతో ఆబాల గోపాలాన్ని అలరించిన దిగ్గజ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అస్తమించారన్న వార్త నన్ను తీవ్రంగా కలిచివేసిందని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని నేను ప్రతిరోజూ ఆ లక్ష్మీ నరసింహ స్వామికి పూజ చేశాను అని అన్నారు. కానీ ఇంతలోనే బాలు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారన్న వార్తను జీర్ణించుకోలేకపోతున్నాను అన్నారు.ఎస్పీ బాలసుబ్రమణ్యంతో మా నందమూరి కుటుంబానికి ప్రత్యేక అనుబంధం ఉంది అని చెప్పారు. నాన్నగారు నటించిన ఎన్నో చిత్రాల్లో ఆయన సుమధుర గానం అందించారని అన్నారు. చిత్రం భళారే విచిత్రం అంటూ గంభీరమైన స్వరంతో బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట తెలుగువారి గుండెల్లో నిలిచిపోయిందని బాలయ్య అన్నారు. ఎస్పీబీ మృతి తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటు అని పేర్కొన్నారు. బాల సుబ్రహ్మణ్యం ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను అని బాలయ్య అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version