తెలంగాణ “దళిత బంధు” కొత్త మార్గదర్శకాలు

-

కేసీఆర్‌ ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా అమలు చేయాలని యోచిస్తోంది. ఈ పథకాన్ని తొలుత హుజురాబాద్‌ నియోజక వర్గంలో పైలట్‌ ప్రాజెక్టుగా ప్రారంభించాలని సీఎం కేసీఆర్‌ భావించినప్పటికీ… కోర్టు కేసుల నేపథ్యంలో దత్తత గ్రామం వాసాల మర్రిలో అమలు చేస్తున్నారు. అయితే.. తాజాగా ఈ దళిత బంధు పథకానికి సంబంధించిన ప్రాథమిక మార్గదర్శకాలను కేసీఆర్‌ సర్కార్‌ రిలీజ్‌ చేసింది. జిల్లా, మండలం, గ్రామ స్థాయిలో కమిటీలను నియమించి ఈ పథకాన్ని అమలును పర్యవేక్షించనున్నట్లు ప్రకటించింది తెలంగాణ సర్కార్‌.

cm kcr | సీఎం కేసీఆర్

ప్రభుత్వం నిర్ధేశించిన కమిటీలే దళిత బంధు పథకం అమలులో కీలకంగా వ్యవహరించనున్నాయి. పథకంపై అవగాహన సదస్సులు నిర్వహించడం.. డేటా బేస్‌ లో అర్హత కలిగిన కుటుంబాల పేర్లు నమోదు చేయడం, జిల్లా కలెక్టర్‌ నుంచి మంజూరు పత్రాల పంపిణీ, లబ్దిదారులకు శిక్షణ, అవసరమైన వనరుల కూర్పు, సలహాలు, సూచలనలివ్వడం క్యూఆర్‌ కోడ్‌లతో కూడిన ఐడీ కార్డుల జారీ, యూనిట్ల పనితీరు పరిశీలన, ఇన్యూరెన్స్‌ కవరేజీ తదితర అంశాలను ఈ కమిటీలు పర్యవేక్షిస్తాయి. మండల, గ్రామ కమిటీలు లబ్దిదారులతో ప్రతినెలా సమావేశాలు నిర్వహిస్తాయి. వారితో చర్చించి.. సమస్యలేమైనా ఉంటే గుర్తించటం.. వాటిఆకి పరిష్కారం చూపడం లాంటి చర్యలు తీసుకుంటాయి. ఈ సమావేశాలు, చర్చల నివేదికలను డేటాబేస్‌ లోకి అప్లోడ్‌ చేస్తాయి.

మార్గ దర్శకాలు :

రూ. 10 లక్షల ఆర్థిక సాయం నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి జమ
సొమ్ము తిరిగి ప్రభుత్వానికి చెల్లించాల్సిన పనిలేదు
పథకం అమలుకు జిల్లా, మండల, గ్రామ స్థాయిల్లో కమిటీలు
లబ్దిదారులు పెట్టుకునే యూనిట్లపై అవగాహన కార్యక్రమాల నిర్వహణ
ఎస్సీల రక్షణ కోసం జిల్లా స్థాయిలో దళిత రక్షణ నిధి ఏర్పాటు (మంజూరైన రూ. 10 లక్షల్లో రూ. 10 వేలు + ఎస్సీ కార్పొరేషన్‌ నుంచి రూ. 10 వేలు + ప్రతి ఏటా లబ్దిదారు రూ. 1000 జమ చేయాలి)

Read more RELATED
Recommended to you

Exit mobile version