లైంగిక వేధింపులు : విజయవాడ కోవిడ్ ఆసుపత్రికి కొత్త ఇంచార్జ్ సూపరింటెండెంట్ !

-

విజయవాడలోని రాష్ట్రస్థాయి కొవిడ్‌ ఆసుపత్రికి సిద్ధార్థ మెడికల్ కాలేజీలో జనరల్ సర్జరీ ప్రొఫెసర్ గా ఉన్న డాక్టర్ కే శివ శంకర్ రావు ఇంచార్జ్ సూపరింటెండెంట్ గా నియమితులు అయ్యారు. ఇప్పటిదాకా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ గా డాక్టర్‌ నాంచారయ్యను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో ఆయనను విధుల నుండి తప్పించారు. గతంలో ఇదే ఆస్పత్రిలో పనిచేసి విధుల నుంచి తొలగించిన డేటా ఎంట్రీ ఆపరేటర్‌ నాన్చారయ్య మీద దిశ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

నాంచారయ్య కొద్దిరోజులుగా తనను లైంగికంగా వేధిస్తున్నారని, ఆయన చెప్పినట్టు వినకపోవడంతో 20 రోజుల క్రితం తనను విధుల నుంచి తొలగించారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో ఆయనపై ఐపీసీ 354ఎం, 367 కింద కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. సూపరింటెండెంట్‌ నాంచారయ్య వ్యవహార శైలి మొదటి నుండి వివాదాస్పదమే. ఈయన మీద గతంలోనూ జిల్లా కలెక్టరుకు వరుస ఫిర్యాదులు అందాయి. ఆసుపత్రిలో జరుగుతున్న అవినీతి, అక్రమాలకూ సూపరింటెండెంట్‌ నాంచారయ్య కేంద్రబిందువుగా మారారని కూడా ఆరోపణలు మొదటి నుండి ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version