ప్రతి ఒక్కరూ పనిలో ఎంత బిజీగా ఉన్నప్పటికీ టింగ్ మని ఫోన్ లో వాట్సాప్ మెసేజ్ సౌండ్ వినగానే ఆతృతగా చూస్తాం ఎంటా మెసేజ్ అని, అలాంటప్పుడు ఒక్కోసారి మనకు వచ్చిన మెసేజ్ డిలీట్ అయి ఉండటం మనం చూస్తున్నాం. వేరే వాళ్లకు పంపాల్సిన మెసేజ్ మరొకరికి వెళ్ళినప్పుడు ఇలా డిలీట్ చేస్తారు. అయితే అలా డిలీట్ అయిన మెసేజ్ ఏంటి అని ఒక ఆత్రుత ఉంటుంది.
కానీ ఇప్పుడు అలా కాదు ఈ యాప్ ను ఉపయోగించడం ద్వారా అలా డిలీట్ అయిన మెసేజ్ ను ఇప్పుడు మనం తెలుసుకోవచ్చు. అయితే ఈ మెసేజ్ ను చూడటానికి వాట్సాప్ లో ఎలాంటి సెట్టింగ్స్ ఉండవు. వాటిని చూసేందుకు సపరేట్‌గా ‘సేవ్ నోటిఫికేషన్’ పేరుతో ఉండే థర్డ్ పార్టీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఇది ప్లేస్టోర్‌లో అందుబాటులో ఉంటుంది.
దీనిని ఎలా ఉపయోగించాలి అంటే మెసేజ్ డిలీట్ చేసినప్పుడు అది డిలీట్ అయ్యినట్టు మనకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ నోటిఫికేష న్లు ముందే మనం ఇన్స్టాల్ చేసుకున్న థర్డ్ పార్టీ యాప్‌లో సేవ్ అవుతూ ఉంటాయి. అటువంటప్పుడు వాట్సాప్‌లో మెసేజ్ డిలీట్ చేసినప్పటికీ ఆ మెసేజ్ నోటిఫికేషన్ యాప్‌లో సేవ్ అయి ఉండటం వల్ల డిలీట్ అయిన మెసేజ్ ఏంటీ అనేది మనం తెలుసుకోవచ్చు.