గుడ్ న్యూస్..ఆగస్టు మొదటి వారం నుంచే కొత్త పెన్షన్లు

-

ఆగస్టు మొదటి వారం నుంచే కొత్త పెన్షన్లు ఇస్తామని ప్రకటించారు మంత్రి కేటీఆర్‌. అర్హులైన అందరికీ పెన్షన్లు ఇస్తామని చెప్పారు మంత్రి కేటీఆర్‌. రాష్ట్రంలో ఐదు రకాల రంగాల్లో విప్లవాత్మక మార్పులు వచ్చాయి అన్నారు ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్. మొదటిది హరిత విప్లవం తో వ్యవసాయం పండగలా మారిందన్నారు. దీనికి అనుగుణంగా ఫుడ్ ప్రాసెసింగ్ పదివేల ఎకరాల్లో రావాలన్నారు.

ఒకప్పుడు తెలంగాణలో చేపలు తక్కువగా దొరికేవని, ఇప్పుడు ఫిషరీస్ లో ఇండియా నెంబర్ వన్ గా మారిందన్నారు. కొత్తగా కట్టుకున్న రిజర్వాయర్లు మిషన్ భగీరథ తోనే ఇది సాధ్యమైందన్నారు. మీట్ ప్రాసెసింగ్ రావాలని, మీట్ ఇండస్ట్రీ భారతదేశానికి కాక ఇతర దేశాలకు కూడా మాంసం ఎగుమతి చేసే స్థాయికి ఎదగాలని అన్నారు.

రాష్ట్రంలో గొర్రెల పెంపకం ఎక్కువగా చేపట్టాలని ఆదేశించారు. రాష్ట్రంలో కురుమ, గొల్ల సోదరులకు గొర్ల పంపిణీ చేస్తున్నామని తెలిపారు. మన రాష్ట్రంలో వరి ఎక్కువగా పండిస్తున్నామని, వారికి ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. రాబోయే రోజుల్లో 20 లక్షల ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు కోసం కృషి చేస్తున్నామన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version