స్మశానంలో నుంచి చిన్నారి ఏడుపు.. తవ్వి చూస్తే..

-

స్మశానవాటికలో నుంచి ఓ చిన్నారి ఏడుపు శబ్ధం వినిపించింది. దీంతో స్థానికంగా కట్టెలు ఏరుతున్న స్థానికులు అక్కడ పరిశీలించి చూడగా.. అక్కడ ఒక చోట సమాధిపై మట్టి కదులుతున్నట్లు కనిపించింది. దీంతో వారంతా భయంతో పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఊరందరినీ తీసుకొచ్చి స్మశాన వాటిక వద్దకు చేరుకున్నారు. కదులుతున్న మట్టిని తవ్వి చూడగా.. ఓ చిన్నారి కనిపించింది. అయితే ఆ బాలికపై తీవ్రమైన గాయాలు కనిపించాయి.

చిన్నారి- స్మశానం

బాలిక నోటి నుంచి మాటలు కూడా రావడం లేదు. దీంతో స్థానికులు ఆమెను చేరదీశారు. మంచినీళ్లు తాగించి.. ఆహారం తినిపించారు. కొంచెం సేపటి తర్వాత బాలిక వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆ చిన్నారి పేరు లాలీ అని.. తండ్రి పేరు రాజు, తల్లి పేరు రేఖ అని తెలిపారు. తనకు ఏం జరిగిందనే విషయం చెప్పగానే గ్రామస్తులంతా కంగుతిన్నారు. తల్లి, నానమ్మ కలిసి తనను బయటకు వెళ్దామని చెప్పి తీసుకొచ్చి మట్టిలో పూడ్చి పెట్టారంటూ ఆ చిన్నారి బోరున ఏడ్చింది. ఊరి పేరు సరిగ్గా చెప్పలేకపోయింది. ఛప్రా జిల్లా కోపా గ్రామానికి చెందిన మర్హా నది ఒడ్డున ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ మేరకు పోలీసులకు సమాచారం అందించడంతో ఏఎస్ఐ రవీందర్ సింగ్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ మేరకు బాలికను ఆస్పత్రికి తరలించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version