ఇసుక అమ్మకాలకు కొత్త పాలసీ – సీఎం రేవంత్ రెడ్డి

-

ఇసుక అక్రమ రవాణాపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని జిల్లాల్లో విజిలెన్స్, ఏసీబీ అధికారులతో తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు.తమిళనాడు,ఏపీ,కర్ణాటక తదితర రాష్ట్రాల విధానాలపై అధ్యయనం చేయాలని సూచించారు. ఇసుక పాలసీ అవినీతి దందాగా మారిందని, ఇక నుంచి ఇసుక అమ్మకాలకు కొత్త పాలసీ తయారు చేయాలని నిర్ణయించారు. 48 గంటల్లోగా అధికారులు పద్ధతి మార్చుకోవాలని, బాధ్యులైన ఏ ఒక్కరిని వదిలిపెట్టొద్దని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

గురువారం గనులు, భూగర్భ ఖనిజ వనరుల శాఖ అధికారులతో సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం రాష్ట్రంలో అమల్లో ఉన్న ఇసుక పాలసీ అవినీతి దందాగా మారిందని ముఖ్యమంత్రి ఆరోపించారు . నిబంధనలకు వ్యతిరేఖంగా ఇసుక క్వారీయింగ్, అక్రమ ఇసుక రవాణాను వెంటనే అరికట్టాలని హెచ్చరించారు.48 గంటల్లో అన్ని స్థాయిల్లో అధికారులు తమ పద్ధతి మార్చుకోవాలని సూచించారు.బాధ్యలైన ఎవరిని వదిలిపెట్టొద్దని ఉన్నతాధికారులను ఆయన ఆదేశించారు. రెండు రోజుల తర్వాత విజిలెన్స్, ఏసీబీ విభాగాలను రంగంలోకి దింపాలని,అన్ని జిల్లాల్లో వెంటనే తనిఖీలు ముఖ్యమంత్రి చేపట్టాలన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version