కొత్త రేషన్ కార్డుల జారీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. త్వరలోనే రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని వెల్లడించారు.రేషన్ కార్డులు ఇచ్చేందుకు పరిమితి లేదని, అది నిరంతరం ప్రక్రియ అని రేవంత్ రెడ్డి అన్నారు.
తెలంగాణలో విద్యుత్ కోతలు లేవని.. కొందరు కావాలనే చేస్తున్నట్లు ఉందని మండిపడ్డారు. రేపటి నుండి సచివాలయానికి వెళ్తానని..పూర్తి స్థాయిలో పాలనపై ఫోకస్ పెడతానని తెలిపారు. ఎన్నికలకు ముందు సెక్రటేరియట్‌కు వెళ్తే విమర్శలు వస్తాయనే వెళ్లలేదని స్పష్టం చేశారు. అత్యవసర అంశాలపై నిర్ణయాలకు ఎన్నికల ప్రవర్తన నియమావళి అడ్డురాదని అన్నారు. ప్రతి అంశాన్ని అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.ఇక, ఆంధ్ర ప్రదేశ్ లో ఎవరూ అధికారంలోకి వచ్చినా ఇరురాష్ట్రాల సమస్యలను పరిష్కరించుకుంటామన్నారు. పొరుగు రాష్ట్రం కావడంతో వారితో సత్సంబంధాలు కొనసాగిస్తామని తెలిపారు. వచ్చే 10 సంవత్సరాలు రాష్ట్రంలో అధికారంలో ఉంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.