దసరా సెలవులను నేపథ్యంలో రోడ్లమీద వెళ్లే ప్రయాణికుల సంఖ్య భారీగా పెరుగుతోంది. నేటి నుంచి సెలవులు కావడంతో చాలామంది ప్రజలు వారి సొంత ఊర్లకు వెళ్తున్నారు. దీంతో టోల్ ప్లాజాల వద్ద రద్దీ భారీగా పెరుగుతోంది. దీంతో టోల్ ప్లాజాల వద్ద అధికంగా సమయం వృధా అవుతోంది. అయితే టోల్ ప్లాజాల వద్ద మినిమం వెయిటింగ్ టైం రూల్ ఉందని చాలామందికి తెలియదు. NHAI సర్క్యులర్ ప్రకారం టోల్ బూత్ వద్ద ఒక్కో వాహనం 10 సెకండ్లకు మించి ఉండాల్సిన అవసరం ఉండదు.

100m+ దూరంలో వెహికల్స్ నిలిచిపోతే టోల్ ఫీజు చెల్లించకుండానే వారు అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. క్యూ 100m లోపునకు వచ్చేవరకు ముందున్న వాహనాలను ఫీజు లేకుండానే వదిలేయాలి. ఈ విషయం తెలియక చాలామంది వాహనాదారులు క్యూ లైన్లలో గంటల తరబడి టోల్ ప్లాజాల వద్ద వేచి ఉంటున్నారు. దానివల్ల వారికి చాలా సమయం వృధా అవుతుంది. ఇకనుంచి అయినా వాహనదారులు ఈ రూల్ తెలుసుకొని వెళ్లాలని అధికారులు చెబుతున్నారు.