పీఎఫ్ ఖాతాదారులకు న్యూ రూల్స్ , పన్ను కట్టాల్సిందే..!

-

వివిధ సంస్థ‌ల్లో ప‌ని చేస్తున్న ఉద్యోగులు, కార్మికుల కోసం కేంద్ర ప్ర‌భుత్వం నిర్వ‌హిస్తున్న రిటైర్మెంట్ సేవింగ్స్ స్కీం.. ప్రావిడెండ్ ఫండ్‌. ప్ర‌తి నెలా ఉద్యోగులు, కార్మికుల వేత‌నాల నుంచి కొంత సొమ్ము వారి పీఎఫ్ ఖాతాలో జ‌మ చేస్తారు. పీఎఫ్ ఖాతాలో పెట్టుబ‌డి పెట్టిన ప్ర‌తి వ్య‌క్తి లేదా ఉద్యోగి.. కార్మికుడు 60 ఏండ్ల‌కు రిటైర్మెంట్ అయిన త‌ర్వాత గానీ, అంత‌కుముందు గానీ విత్‌డ్రా చేసుకోవ‌చ్చు. అందుకు కొన్ని అత్య‌వ‌స‌ర ష‌ర‌తులు, మార్గ‌ద‌ర్శ‌కాలు ఉన్నాయి.

 

 

2021 బ‌డ్జెట్ ముందు వ‌ర‌కు ఈపీఎఫ్‌పై వ‌చ్చే వడ్డీ ఆదాయంపై పూర్తి పన్ను రాయితీ ఉంది. కానీ గ‌తేడాది ఆర్థిక సంవ‌త్స‌ర బ‌డ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ కొత్త ప్ర‌తిపాద‌న తీసుకొచ్చారు. ప్ర‌తియేటా పీఎఫ్ ఖాతా రూ.2.5 ల‌క్ష‌లు దాటితే ప‌న్ను విధిస్తామ‌ని తెలిపారు. ఉద్యోగుల పీఎఫ్ మొత్తంపై ఎలా ప‌న్ను విధిస్తార‌న్న విష‌య‌మై కేంద్ర ప్ర‌త్య‌క్ష ప‌న్నుల బోర్డు (సీబీడీటీ) కొత్త రూల్స్‌ను నోటిఫై చేసింది. గ‌తేడాది ఆగ‌స్టు 31న సీబీడీటీ నోటిఫికేష‌న్ జారీ చేసింది. రూ.2.5 ల‌క్ష‌ల‌కు పైగా కంట్రిబ్యూష‌న్ ఉంటే ప‌న్ను విధిస్తారు. పీఎఫ్ ఖాతాలో యాజ‌మాన్యాల కంట్రిబ్యూష‌న్ లేక‌పోతే రూ.5 ల‌క్ష‌ల వ‌ర‌కు లిమిట్ పెంచారు.

ప్ర‌తి సంస్థ య‌జ‌మాని త‌మ సంస్థ‌లో ప‌ని చేసే ఉద్యోగి క‌నీస వేత‌నంలో 12 శాతం ప్ల‌స్ డీఏను ఈపీఎఫ్ ఖాతాలో జ‌మ చేస్తారు. ప్ర‌తి నెలా ఉద్యోగి వేత‌నం నుంచి 12 శాతం కోత విధించి పీఎఫ్ ఖాతాకు త‌ర‌లిస్తారు. ఇందులో 8.33 యాజ‌మాన్యం కంట్రిబ్యూష‌న్‌ను ఉద్యోగుల పెన్ష‌న్ ప‌థ‌కం (ఈపీఎస్‌)కు మ‌ళ్లిస్తారు. ఈపీఎస్‌కు మ‌ళ్లించిన మొత్తంపై వ‌డ్డీ ఆదాయం ఉండ‌దు.

ఈ నెలాఖ‌రు వ‌ర‌కు పీఎఫ్‌పై వ‌చ్చే వ‌డ్డీ ఆదాయం మీద పూర్తిగా ప‌న్ను రాయితీ ఉంటుంది. వ‌చ్చే ఆర్థిక సంవ‌త్స‌రం నుంచి ప్ర‌తియేటా వ‌డ్డీ ఆదాయంపై ప‌న్ను విధిస్తారు. రూ.2.5 ల‌క్ష‌ల్లోపు, రూ.2.5 ల‌క్ష‌ల పైచిలుకు కంట్రిబ్యూష‌న్ గ‌ల పీఎఫ్ ఖాతాల‌పై వ‌చ్చే వ‌డ్డీ ఆదాయం ఆధారంగా విడ‌దీస్తారు.

2022 ఏప్రిల్ ఒక‌టో తేదీ నుంచి కొత్త పీఎఫ్ నిబంధ‌న‌లు అమ‌ల్లోకి వ‌స్తాయి. ఆదాయం ప‌న్ను చ‌ట్టంలో 9డీ సెక్ష‌న్ కొత్త‌గా చేర్చారు. దీని ప్ర‌కారం రూ.2.5 ల‌క్ష‌ల‌కు పైగా ఉద్యోగుల కంట్రిబ్యూష‌న్‌పై వ‌చ్చే వ‌డ్డీ ఆదాయంపై నూత‌న ప‌న్ను వ‌సూలు చేస్తారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version