కొత్త ఆర్ధిక సంవత్సరం ఇక వచ్చేస్తోంది. అయితే వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఆదాయపు పన్ను నిబంధనలలో మార్పులు వస్తున్నాయి. డిజిటల్, క్రిప్టో ఆస్తులపై ఆదాయపు పన్ను, అప్‌డేట్ చేయబడిన రిటర్న్‌ల దాఖలు, ఈపీఎఫ్ వంటి వాటిల్లో కొన్ని మార్పులు రానున్నాయి.
వాటిని గమనిస్తే మంచిది. లేదంటే అనవసరంగా ఇబ్బంది పడాలి. ఏప్రిల్1 , 2022 నుంచి చోటు చేసుకోబోతున్న ఆ కొన్ని మార్పులు గురించి చూద్దాం. మరి ఇక పూర్తి వివరాల లోకి వెళితే..
క్రిప్టోకరెన్సీలపై పన్ను విధానం:
క్రిప్టోకరెన్సీలపై పన్ను విధానం క్రమంగా అమలులోకి రానుంది. క్రిప్టో ఆస్తులపై సుమారు 30 శాతం పన్ను వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అమలులోకి రాబోతోంది. శాతం టీడీఎస్ మాత్రం జూలై 1 నుంచి అమలులోకి వస్తాయి. క్రిప్టో ఆస్తులపై ఆదాయపు పన్ను విధింపు మేరకు బడ్జెట్ లో కేంద్రం చెప్పింది. ఇది ఇలా ఉంటే క్రిప్టోకరెన్సీ, డిజిటల్ ఆస్తుల విషయలో కేంద్రం కొత్త రూల్స్‌ను తీసుకు రావడం జరిగింది.
క్రిప్టో కరెన్సీపై కేంద్రం నిబంధనలను మరింత కఠినతరం చేసింది. క్రిప్టో ఆస్తులను మైనింగ్ చేస్తున్నప్పుడు ఏర్పడే అవస్థాపన ఖర్చులపై ట్యాక్స్ బెనిఫిట్స్ వుండవు. ఒక వ్యక్తి బిట్‌కాయిన్‌పై రూ. 1000 లాభం, మరోక క్రిప్టోకరెన్సీ ఈథిరియం రూ. 700 నష్టాన్ని పొందినట్లయితే, సదరు వ్యక్తి రూ.1000పై పన్ను కట్టాల్సిందే.
పన్ను రిటర్న్:
అలానే పన్ను రిటర్న్‌లలో చేసిన తప్పులను సరిదిద్దుకునేందుకు గాను కొత్త నిబంధన అమలులోకి రానుంది. అసెస్‌మెంట్ సంవత్సరం ముగిసిన రెండు సంవత్సరాలలోపు అప్‌డేటేడ్ రిటర్న్‌ను ఫైల్ చేసుకోచ్చు.
ఎన్‌పీఎస్ మినహాయింపు:
ఇప్పుడు సెక్షన్ 80CCD(2) కింద తమ బేసిక్ జీతం, డియర్‌నెస్ అలవెన్స్‌లో 14 శాతం వరకు ఎన్‌పీఎస్ కంట్రిబ్యూషన్ కోసం ఎంప్లాయర్ ద్వారా డిడక్షన్‌ను క్లెయిమ్ ని స్టేట్ గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ చేసుకోచ్చు.
ప్రావిడెంట్ ఫండ్:
అలానే ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ రూ. 2.5 లక్షలు దాటితే పన్ను విధిస్తున్నారు.