స్నానం చేయకపోవడం వల్ల చాలా సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. చాలామంది రోజూ స్నానం చేయకుండా స్కిప్ చేస్తూ ఉంటారు. మీరు కూడా స్నానం చేయకుండా స్కిప్ చేస్తూ ఉంటారా..? అయితే తప్పకుండా మీరు దీని గురించి తెలుసుకోవాలి.
స్నానం చేయకపోవడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. రోగనిరోధక శక్తి మొదలు దుర్వాసన వరకు చాలా సమస్యలు స్నానం చేయకపోవడం వల్ల వస్తాయి. అయితే మరి స్నానం చేయకపోవడం వల్ల కలిగే ప్రమాదకరమైన సమస్యలు ఏమిటి అనేది చూద్దాం.
ఒంటి నుండి దుర్వాసన:
సాధారణంగా మనకు చెమటలు ఎక్కువగా పడుతుంటాయి. దీని వలన చర్మం పై బ్యాక్టీరియా వంటివి పేరుకుపోతాయి. ఎక్కువసేపు కనుక ఇవి మన ఒంటి మీద ఉంటే దుర్వాసన కలుగుతుంది. రోజూ స్నానం చెయ్యలేదు అంటే ఈ ఇబ్బంది పడాల్సి వస్తుంది.
పొట్ట మరియు తొడ భాగంలో సమస్యలు:
మీరు కనుక స్నానం చేయకపోతే ఈ భాగంలో ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. దుర్వాసన మాత్రమే కాకుండా ఈస్ట్ ఇన్ఫెక్షన్స్ వంటివి కూడా కలిగే అవకాశం ఉంది. ఆ ప్రాంతంలో పేరుకుపోయిన చెమట, మురికి వల్ల దురదలు కలుగుతాయి.
చర్మ సమస్యలు:
మీరు తరచుగా స్నానం చేయకుండా ఉన్నట్లయితే చర్మ సమస్యలు కలిగే అవకాశం ఉంది. దురదలు ఎక్కువగా రావడం, చర్మానికి ఇబ్బంది కలగడం జరుగుతూ ఉంటాయి.
డెడ్ స్కిన్ ఎక్కువ అవుతుంది:
ప్రతి రోజూ స్నానం చేయకపోయినట్లయితే ఒంట్లో డెడ్ స్కిన్ ఎక్కువవుతుంది పైగా అది ఒళ్ళంతా కూడా స్టోర్ అయి ఉంటుంది.
ఇన్ఫెక్షన్స్ వస్తాయి:
మనం రోజూ ఎన్నో పనులు చేస్తూ ఉంటాము ఎన్నో వస్తువులను ముట్టుకుంటూ ఉంటాము. మొబైల్ ఫోన్స్, తలుపులు, టాయిలెట్స్ ఇలాంటివన్నీ పట్టుకోవడం వల్ల క్రిములు అంటుకుంటాయి. అలాంటప్పుడు మనం స్నానం చేయకుండా శుభ్రంగా లేము అంటే ఇన్ఫెక్షన్స్ వస్తాయి.
ఇన్ఫెక్షన్స్ వల్ల జలుబు, హెపటైటిస్ ఏ వంటి సమస్యలు వస్తాయి. చేతులు ఎలా అయితే శుభ్రంగా ఉంచుకోవాలో అలానే బాడీని కూడా శుభ్రంగా ఉంచుకోవాలి స్నానం కనక స్క్రిప్ చేశారంటే ఇన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ప్రతి రోజూ తప్పకుండా స్నానం చేయండి.