రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్ని కొత్త రూల్స్ ని తీసుకు రానుంది. వీటిపై ఆయా బ్యాంకులు తమ కస్టమర్స్ కి తెలుపుతున్నారు. అయితే క్రెడిట్, డెబిట్ కార్డు యూజర్లు మాత్రం ఈ కొత్త రూల్స్ ని తెలుసుకోవాలి. 2022 జనవరి 1 నుంచి లావాదేవీలు నిర్వహించాలంటే క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు 16 అంకెలు ఎంటర్ చెయ్యాలి.
గతంలో అయితే కేవలం పిన్ నెంబర్‌ను ఎంటర్ చేస్తే సరిపోయేది. కానీ ఇప్పుడు అలా కాదు. ఇది ఇలా ఉంటే ఇకపై వెబ్‌సైట్లు, పేమెంట్ గేట్‌వేస్‌లలో బ్యాంకు వినియోగదారుల క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డుల వివరాలు సేవ్ చేసి ఉండవని గమనించాలి.
కార్డు నెంబర్లకు బదులు టోకెన్ నెంబర్లు ఇవ్వడం జరుగుతుంది. డిజిటల్ చెల్లింపులు, ఆన్‌లైన్ షాపింగ్ చేసేటప్పుడు మర్చంట్ వెబ్‌సైట్స్, యాప్స్ వంటివి కస్టమర్ల క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు వివరాలను నిక్షప్తం చెయ్యకూడదని అంది. ఇక టోకెనైజేషన్ అంటే ఏమిటి అనేది చూస్తే.. మనం లావాదేవీలను చేసే సమయంలో 16 అంకెల నంబర్, కార్డు గడువు తేదీ, సీవీఈ, ఓటీపీని నమోదు చేయాలి.
కానీ టోకెనైజేషన్ విధానంలో కార్డు కలిగిన వారు కార్డు వివరాలు ఇవ్వక్కర్లేదు. ఒరిజినల్ కార్డు నంబర్‌కు బదులు వేరే కోడ్ ఇస్తారు. దీనినే టోకెన్ అంటారు. అలా ట్రాన్సక్షన్ చెయ్యాలి. కార్డు భద్రతా నేపథ్యంలో ఆర్బీఐ ఈ నిబంధనలు తీసుకువచ్చింది. యాప్స్ కస్టమర్ల కార్డుల వివరాలను స్టోర్ చేయకూడదని ఆదేశించింది.