హోం ఐసోలేషన్ పేషెంట్లకు కొత్త మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్రం.

-

ఇండియాలో కరోనా వ్యాప్తి మళ్లీ పెరిగింది. గత వారం రోజుల నుంచి కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గత కొన్ని రోజుల దాకా రోజూవారీ కేసులు 10 వేల లోపే ఉంటే ప్రస్తుతం 30 వేలు, 50 వేల కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి.

ఈ క్రమంలోనే హోం ఐసోలేషన్ లో ఉంటున్న పేషెంట్లకు కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. సింప్టమ్స్ తక్కువగా ఉండవారికి, అసలే లేని వారికి ఈ మార్గదర్శకాలు వర్తించనున్నాయి. వరసగా మూడు రోజులు జ్వరం రాకపోతే కేవలం 7 రోజుల ఐసోలేషన్ సరిపోతుందని తెలిపింది. కోవిడ్ వచ్చిన వారు ట్రిపుల్ లేయర్ మాస్క్ లను ధరించాలని, వెంటిలేషన్ బాగా ఉండే రూంలో ఐసోలేట్ అవ్వాలని సూచించింది. ఇతరులతో ఎటువంటి కాంటాక్ట్ లేకుండా చూసుకోవాలని సూచించింది కేంద్రం. హోం ఐసోలేషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్లీ టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం లేదని తెలపింది.

హెచ్ఐవీ, అవయవాలు ట్రాన్స్‌ప్లాంట్ , క్యాన్సర్ థెరపీ లేని వారు మాత్రమే హోం ఐసోలేషన్ కు అనుమతించబడతారని మార్గదర్శకాలు జారీ చేసింది. హైగ్రేడ్ ఫివర్, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, ఆక్సిజన్ శాతం 93 కన్నా తక్కువగా ఉండేవారికి ఖచ్చితంగా మెడికల్ సపోర్ట్ అవసరమని కేంద్రం తెలిపింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version