అయోధ్య రామాలయంకు వెళ్లే భక్తులకు బిగ్ అలెర్ట్. అయోధ్య రామాలయంలో కొత్త రూల్స్ అమలు చేయనున్నారు. అయోధ్య రామాలయంలో జూలై 1 నుంచి కొత్త రూల్స్ అమలు కానున్నాయి. రామాలయంలో పూజారులు ఆండ్రాయిడ్ ఫోన్‌లను ఉపయోగించకూడదని ట్రస్ట్ తేల్చింది.
పూజారి కుటుంబ సభ్యులతో మాట్లాడటానికి కీప్యాడ్ మొబైల్ మాత్రమే ఉపయోగించాలని సూచించారు. ఈ నిబంధన సీనియర్, జూనియర్ అర్చకులందరికీ వర్తిస్తుంది. కాగా, అయోధ్య రామందిరంలో నీటి లీకేజీపై దేశవ్యాప్తంగా రచ్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. కేంద్రం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రామ మందిరంలో నీటి లీకేజీ అవ్వడంపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నాయి.ఈ క్రమంపై నీటి లీకేజీ వార్తలపై అయోధ్య రామ మందిరం ట్రస్టు క్లారిటీ ఇచ్చింది. రామ్ లల్లా గర్భగుడిలో నీటి లీకేజీ లేదని స్పష్టం చేసింది. రామ్ లల్లా గర్భగుడి పైకప్పు నుండి ఒక చుక్క నీరు లీక్ అవ్వడం లేదని ట్రస్ట్ వెల్లడించింది.