హైదరాబాదులో మరొక భారీ స్కాం వేలుగు చూసింది. ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ పేరుతో భారీ మోసం బయటకు వచ్చింది. చిన్న తరహా పెట్టుబడుల పేరుతో ముసాని పాల్పడ్డ ఫాల్కన్.. ఒక హైదరాబాదులోనే 850 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈ క్రమంలో ఫాల్కన్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ పవన్ కుమార్ ఓదెల్ అరెస్ట్ అయ్యారు. ఫాల్కన్ క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ డైరెక్టర్ కావ్య నల్లూరిని కూడా అరెస్ట్ చేసారు పోలీసులు.
చిన్న మొత్తల పెట్టుబడుల పేరుతో వసూళ్లకు పాల్పడ్డా ఫాల్కన్.. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 1700 కోట్ల రూపాయలు వసూలు చేసింది. 6979 మంది బాధితుల నుంచి 1700 కోట్లు దోచుకుంది. చిన్న తరహా పెట్టుబడుల బ్రిటానియా అమెజాన్ గోద్రెజ్ లాంటి సంస్థల్లో పెట్టుబడులు పేరుతో మోసం చేసింది. ఫాల్కన్ కి అనుబంధంగా 14 సంస్థలు ఏర్పాటు చేసి వసూళ్లకు పాల్పడింది. అయితే ఫాల్కన్ స్కాంపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నాం ఈ ఓ డబ్లు డిసిపి ప్రసాద్.. దేశవ్యాప్తంగా ఉన్న బాధితులకు న్యాయం చేసేందుకు ప్రయత్నాలు చేస్తాం అన్నారు.