రాజ్ తరుణ్ – లావణ్య కేసు రోజుకో కీలక మలుపు తిరుగుతోంది. ఈ కేసులో లావణ్య మస్తాన్ సాయి పై తీవ్ర ఆరోపణలు చేస్తూ నార్సింగి పోలీసులకు కంప్లెంట్ కూడా ఇచ్చారు. కాగా పోలీసులు మస్తాన్ సాయిని అరెస్ట్ చేశారు. మస్తాన్ సాయి విచారణలో దొరికిన అనేక న్యూడ్ వీడియోలు, కాల్ రికార్డింగ్స్ ఉన్నట్టు సంచలన విషయాలు బయటకు రాగా.. తన జీవితం నాశనం అవడానికి కారణం మస్తాన్ సాయి అని, అతని మాటలు నమ్మి రాజ్ తరుణ్ తో తాను గొడవ పడ్డానని, తనను క్షమించాలని బహిరంగంగా రాజ్
తరుణ్ ను కోరారు లావణ్య.
ఈ క్రమంలో మస్తాన్ సాయి కుటుంబంపై ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ కు లావణ్య అడ్వొకేట్ ఓ కీలక లేఖ రాశారు. మస్తాన్ సాయి కుటుంబం గుంటూరులో మస్తాన్ దర్గా ధర్మకర్తలుగా ఉన్నారని, ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్న వారికి ధర్మకర్తలుగా ఉండే అర్హత లేదని, తక్షణమే వారిని తొలగించాలని ఆ లేఖలో పేర్కొన్నారు. మస్తాన్ సాయి నేరాల వలన దర్గాకు ఉన్న పవిత్రత చెడిపోతుందని.. భగవంతునికి మచ్చ తెచ్చే వారిని దూరం పెట్టాలని తెలిపారు. గవర్నర్ కే కాకుండా ఏపీ సీఎస్, గుంటూరు కలెక్టర్ వంటి పలువురికి కూడా లేఖలు రాశారు లావణ్య న్యాయవాది.