వాట్సాప్‌లో వచ్చిన ఈ సరికొత్త పీచర్ భారత్, బ్రేజిల్, ఇరాన్‌లోని వినియోగదారులకే ఈ అవకాశం. ఈ కొత్త ఫీచర్‌లో భాగంగా స్టిక్కర్ మేకర్ యాప్ ద్వారా వినియోగదారులు స్వయంగా తమ స్టిక్కర్లను తయారు చేసుకోవచ్చు.
స్టిక్కర్ మేకింగ్
సరికొత్త ఈ ఫీచర్ ప్రైవసీ పాలసీ వివాదాస్పదం అవడంతో యూజర్లు చేజారిపోవడంతో వాట్సాప్ దిద్దుబాటు చర్చలు ప్రారంభించింది. ఈ కొత్త ఫీచర్‌ను వాట్సాప్ చేరుస్తూ వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ఇకపై యూజర్లు తమ స్టిక్కర్లను తామే తయారు చేసుకునే సౌలభ్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. వినియోగదారుల ఫీడ్‌బ్యాక్‌ను కూడా తీసుకుని ఆ తర్వాత మిగతా దేశాల్లో ప్రవేశపెడతామని ప్రకటించింది. ఈ సరికొత్త ఫీచర్ 2.21.3.19, ఆ తర్వాతి వెర్షన్‌లు, ఐఓఎస్ 2.21.31.2 అందుబాటులో ఉంటుం నివేదికలో తెలిపింది. చాలా కాలం నుంచి ఎదురుచూస్తున్న యానిమేటెడ్ స్టిక్కర్ల ప్యాక్‌లను డౌన్‌లోడ్ చేసుకునే అవకాశాన్ని వాట్సాప్ తన వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది.
ప్రస్తుతం ఈ ఫీచర్ భారత్, బ్రెజిల్, ఇరాన్‌లోని వినియోగదారులు స్టిక్కర్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఈ యాప్ ద్వారా వినియోగదారులు స్వంతంగా స్టిక్కర్ తయారుచేసుకోవచ్చు. మీ విడియో లేదా gif ఎంచుకోవాలి తర్వాత యాప్ దానంతట అదే స్టిక్కర్లను తయారు చేస్తుంది. ఆ స్టిక్కర్లు WEBP ఫైల్ ఫార్మాట్‌లో ఉండి వాట్సాప్‌లో వినియోగించుకోవడానికి వీలుగా ఉంటుంది. వినియోగదారులు రూపొందించిన స్వంత స్టిక్కర్ ప్యా క్‌లను కనీసం 3 స్టిక్కర్లు ఉండాలి. లేకపోతే ఆ స్టిక్కర్‌ను డౌన్‌లోడ్ చేయడం సాధ్యం కాదు.ఈ స్టిక్కర్లు ఎక్కువ ఫైల్ పరిమాణ కలిగి ఉంటుంది. అందుకే స్టిక్కర్ మేకర్ మీ స్టిక్కర్ ఫైల్ సైజును ఆటోమెటిక్‌గా కుదించడానికి సాయం చేస్తుంది.
వన్ టచ్ మ్యూట్
ఒక్క టచ్‌తోనే మ్యూట్ వీడియో క్రియేట్ చేసే మరో నూతన ఫీచర్‌ను కూడా వాట్సాప్ పరిచయం చేసింది. ఒక్క టచ్‌తో వీడియోలను షేర్ చేస్తుంది. ఆ సమయంలో వాయిస్ మ్యూట్ చేసుకునే సౌలభ్యం కూడా ఉంటుంది. ఈ కొత్త ఫీచర్ ద్వారా అభ్యంతరకర మాటాలను తొలగించవచ్చు. పూర్తి ఆడియోను తొలగించి కేవలం వీడియోను పంపే వెసులుబాటు కకూడా ఉంటుంది. దీనికే సులభంగా ఈ ఆప్షన్‌ను వినియోగించుకోవచ్చు. అవతలి వ్యక్తి వీడియోను రిసీవ్ చేసుకున్న సమయంలో సౌండ్ సింబల్ ఉంటుంది. ఆ సింబల్‌ను మ్యూట్ చేస్తే ఏ వాయిస్ లేని వీడియో ఆ వ్యక్తికి చేరుతుంది.