కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ లో భూమా కుటుంబం తరుపున రాజకీయ పగ్గాలు భూమా మౌనిక తీసుకుంటుందా..కార్యకర్తల సమావేశంలో చేసిన మౌనిక చేసిన వ్యాఖ్యలు కోత్త చర్చకు తెరలేపాయి. అఖిల అరెస్టయిన నేపథ్యంలో భూమా మౌనిక ఆళ్లగడ్డ లో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. సమావేశంలో మౌనిక కాస్త ఆవేదన, ఆవేశం , బాధతో కూడిన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు దీనిపైనే కర్నూలు పాలిటిక్స్ లో చర్చ జరుగుతుంది.
కేసుల పై త్వరలో గవర్నర్, కేంద్ర సహాయ హోం మంత్రి కిషన్ రెడ్డి, డిజిపిని కలుస్థానన్నారు. కొన్ని కారణాల వల్ల రెండేళ్ల నుంచి ఆళ్లగడ్డకు రాలేక పోయానన్నారు. ఎవరి బెదిరింపులకు భయపడ వద్దని,కేసులు, రాజకీయ వత్తిల్లు భూమా కుటుంబానికి కొత్తేమి కాదని మౌనిక కార్యకర్తలకు ధైర్యం చెప్పారు. ఆళ్లగడ్డ సమావేశంలో భూమా మౌనిక చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. 2017లో నంద్యాల ఉప ఎన్నికల తరువాత భూమా మౌనిక రాజకీయాల్లో పెద్దగా కన్పించలేదు. భూమా దంపతుల మృతి తరువాత రాజకీయ పగ్గాలు భూమా అఖిల చేపట్టారు. భూమా జగత్ విఖ్యాత రెడ్డి ఉన్నప్పటికి ప్రధానంగా అఖిల కీలకంగా వ్యవహరిస్తున్నారు.
కిడ్నాప్ కేసులో అఖిల , భార్గవ రాముడు నిందితులుగా ఉన్న నేపథ్యంలో ఆళ్లగడ్డలో రకరకాల చర్చ జరుగుతోంది. భూమా వర్గీయలు కూడా అయోమయంలో, ఆందోళనలో వున్నారు. ఈ పరిస్థితుల్లో భూమా మౌనిక నిర్వహించిన కార్యకర్తల సమావేశం వారి వర్గంలో కొంత ధైర్యం కలిగించినా కొత్త చర్చకు దారితీసింది. కార్యకర్తలకు ఏ చిన్న సమస్య వచ్చినా తనకు ఫోన్ చేయాలని, తాను అండగా ఉంటానని, భూమా కుటుంబం తరుపున బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు. దీంతో భూమా మౌనిక రాజకీయా పగ్గాలు తీడుకుంటారా అనే చర్చ భూమా వర్గంలో ఉందంట.
ఆళ్లగడ్డ లో కార్యకర్తల్లో ధైర్యం నింపేందుకు మౌనిక ఆ వ్యాఖ్యలు చేసారా…నిజంగా రాజకీయ బాధ్యతలు తీసుకుంటారా అని భూమా వర్గీయుల్లో చర్చించుకుంటున్నారట. భూమా నాగిరెడ్డి వారసుడు జగత్ విఖ్యాత రెడ్డి ఉన్నప్పటికి వయసు రీత్యా మరింత అనుభవం అవసరమనే అభిప్రాయం వారి వర్గంలో ఉందంట. భూమా మౌనిక రాజకీయ పగ్గాలు చేపడితే ఎలా ఉంటుందనే దానిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయంట. భూమా మౌనిక కూడా ధైర్యంతో సమస్యలు ఎదుర్కోగలదని కొందరంటే ఆళ్లగడ్డలోనే ఉంటూ కార్యకర్తలకు అందుబాటులో ఉంటే క్యాడర్ నిలబడుతుందని మరికొందరు భావిస్తున్నారట. భూమా అఖిల ఇప్పటికే రాజకీయ బాధ్యతలు నిర్వహిస్తుండగా మౌనిక వస్తుందా అని మరికొందరు ప్రశ్నిస్తున్నారంట.
కార్యకర్తల అయోమయం నేపథ్యంలో వారి అపోహలు తొలగించాలని మౌనిక సమావేశం నిర్వహించారని, రాజకీయ పగ్గాలు తీసుకోవాలని కాదని మరికొందరు వాదిస్తున్నారట. మొత్తమ్మిద భూమా మౌనిక సమావేశం జిల్లాలో పెద్ద చర్చకు దారితీసింది.