మూడు ఎకరాల్లో సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల నిర్మాణం : మంత్రి పొంగులేటి

-

రాష్ట్రవ్యాప్తంగా అత్యాధునిక వసతులతో శాశ్వతంగా సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల నిర్మాణం కోసం అవసరమైన భూములను గుర్తించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు రెవెన్యూ, హౌసింగ్, సమాచార మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. మొదటి దశలో సంగారెడ్డి, పటాన్ చెరువు, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో మేడ్చల్, కుత్బుల్లాపూర్, ఉప్పల్ లో.. రంగారెడ్డి జిల్లాకు సంబంధించి కందుకూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ఫోర్త్ సిటీలో, గండిపేట, శేరిలింగంపల్లి, రంగారెడ్డి డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ కార్యాలయం నిర్మించనున్నారు.

మూడు సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలను గచ్చిబౌలిలోని తెలంగాణ అకాడమీ ఆఫ్ ల్యాండ్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్‌మెంట్ కార్యాలయంలో ఇంటిగ్రేటెడ్ సబ్-రిజిస్ట్రార్ కార్యాలయం నిర్మిస్తున్నట్టు మంత్రి పొంగులేటి ప్రకటించారు. హైదరాబాద్ జిల్లాకు సంబంధించి బంజారాహిల్స్, ఎస్ఆర్ నగర్, గోల్కొండ మూడు సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలను షేక్ పేట్ ప్రాంతంలో ఒకేచోట నిర్మాణం చేయనున్నారు. అయితే ఈ మొదటి దశలో నిర్మించే సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలు కనీసం మూడు ఎకరాల్లో ఉండనున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news