అమ్మో మన వ్యాక్సినా ? వద్దంటూ టెన్షన్ పెడుతోన్న ఉద్యోగులు !

-

తెలంగాణలో రెండో రోజు కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. నిజానికి నిన్న దేశంలోని చాలా రాష్ట్రాల్లో కరోనా వ్యాక్సిన్ వేసినా సరే తెలంగాణలో మాత్రం సెలవు ప్రకటించారు. అయితే ఈ రోజు కరోనా వ్యాక్సినేషన్ కొద్ది సేపటి క్రితమే మొదలైంది. ఇది ఈరోజు కూడా సర్వర్స్ మొరాయిస్తున్నాయి. అయితే మొన్నటి రోజున కేవలం కోవిషీల్డ్ వ్యాక్సిన్ మాత్రమే పంపిణీ చేయగా ఈ రోజు హైదరాబాదు లోనే రూపొందించబడిన కోవాగ్జిన్ కూడా పంపిణీ చేస్తున్నారు.

అయితే ఈ వ్యాక్సిన్ తీసుకునేందుకు చాలా చోట్ల ఉద్యోగులు నిరాకరిస్తున్నారని తెలుస్తోంది. భారత్ బయోటెక్ రూపొందించిన ఈ వ్యాక్సిన్ థర్డ్ ఫేస్ క్లినికల్ ట్రయల్స్ ఇంకా పూర్తి కాలేదని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ వ్యాక్సిన్ తమకు వద్దని ఢిల్లీలో కూడా చాలా మంది ఉద్యోగస్తులు లేఖలు రాశారు. ఇప్పుడు హైదరాబాద్ లో కూడా ఇదే సీన్ రిపీట్ కావడం సంచలనంగా మారింది. ఇక ఈ రోజు నుంచి తెలంగాణలో 324 సెంటర్లలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ జరగనుంది. అయితే మొదటి రోజు కేవలం 30 మందికి మాత్రమే ఒక్కో సెంటర్ లో వ్యాక్సిన్ వేయగా ఈ రోజు మాత్రం ఒక్కో సెంటర్లో 50 మందికి వ్యాక్సిన్ వేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version