అయోధ్య కేసులో కీలక మలుపు.. బాబ్రీ స్థలాన్ని వదిలేస్తాం.. కానీ..

-

అయోధ్య వివాదం ఓ అనూహ్యమైన మలుపు తీసుకుంది. అయోధ్య రామజన్మభూమి – బాబ్రీ మసీదు వివాదాస్పద స్థలానికి సంబంధించిన కేసు విచారణను సుప్రీంకోర్టు నిన్న సాయంత్రం ముగించిన విష‌యం తెలిసిందే. ఇక ప్రస్తుతం తుది తీర్పు మాత్రమే పెండింగ్ లో ఉంది. మ‌రోవైపు వివాదాస్పద స్థలంపై తమకు గల హక్కును వదులుకోడానికి ప్రధాన కక్షిదారుల్లో ఒకటైన సున్నీ వక్ఫ్‌ బోర్డు సంసిద్ధత ప్రకటించింది. కానీ ఇందుకు కొన్ని షరతులు విధించింది.

ఈ మేరకు వాదనలకు చివరిరోజైన బుధవారంనాడు మధ్యవర్తిత్వ కమిటీ ద్వారా తన ప్రతిపాదనను సుప్రీంకోర్టుకు పంపింది. ఈ ప్రతిపాదనలపై సున్నీ వక్ఫ్ బోర్డుతో పాటు కొన్ని హిందూ పక్షాలు కూడా సంతకం చేసినట్టు తెలుస్తోంది. ఈ సెటిల్మెంట్ ప్రతిపాదనను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం పరిశీలించనుంది.

1. దేశంలో ఉన్న మసీదులన్నింటికీ రక్షణ కల్పించాలి. 1991 నాటి ప్రార్థనా స్థలాల చట్టాన్ని కట్టుదిట్టంగా అమలు చేయాలి. కబ్జాలు, విధ్వంసాలు జరగకుండా చూడాలి.

2. బాబ్రీకి ప్రతిగా అయోధ్యలోనే మరో చోట ఒక పెద్ద మసీదును కట్టుకునేందుకు అనుమతించాలి. అయోధ్యలో ఉన్న 22 పాత మసీదుల మరమ్మతులకు సహకారం అందించాలి.

3. పురావస్తు శాఖ ఆధీనంలో ఉన్న మసీదుల్లో కూడా ప్రార్థనలు చేసుకునేందుకు అనుమతించాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version