కడప రాజకీయాలు ఎప్పుడు హాట్ హాట్‌గానే సాగుతాయి. సీఎం జగన్ సొంత జిల్లాగా ఉన్న కడపలో వైసీపీకి ఫుల్ ఆధిక్యం ఉన్న విషయం తెలిసిందే. ఇక్కడ టీడీపీకి ఏ మాత్రం అవకాశం లేదు. గత ఎన్నికల్లో కూడా జిల్లా మొత్తం వైసీపీ చేతుల్లోకి వెళ్లింది. ఇప్పటికీ అక్కడ వైసీపీ లీడ్ తగ్గలేదు. కానీ వైసీపీ లీడ్ తగ్గించడానికి టీడీపీ గట్టిగానే ప్రయత్నిస్తుంది. పలు నియోజకవర్గాల్లో వైసీపీతో ఢీ అంటే ఢీ అనేల టీడీపీ నేతలు పనిచేస్తున్నారు.
ఇలా రెండు పార్టీల మధ్య వార్ నడుస్తున్న సమయంలో కడపలో కొత్త ట్విస్ట్ వచ్చింది. గత ఎన్నికల నుంచి కడపలో వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అయితే ఎన్నికల ముందు ఈ హత్యలో టీడీపీ నేతలకు ప్రమేయం ఉందని, చంద్రబాబు ఇది చేయించారని వైసీపీ నేతలు ఆరోపించారు. కానీ సిబిఐ విచారణ మొదలయ్యాక టీడీపీ నేతల ప్రమేయంపై ఏమి తేలలేదు. కానీ వైసీపీ నేత దేవి శంకర్ రెడ్డిని సిబిఐ అరెస్ట్ చేసింది. అలాగే వివేకా హత్య కేసులో జగన్ సోదరుడు , ఎంపీ అవినాష్ రెడ్డి ప్రమేయం ఉందని టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తూ వస్తున్నారు.
ఇదే క్రమంలో తాజాగా టీడీపీ నేత బీటెక్ రవి…వివేకా కేసు విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేకా కేసులో తనని కాపాడకపోతే బీజేపీలోకి వెళ్లిపోతానని, అవినాష్, జగన్‌కు చెప్పారని, ఆ విషయం వివేకా కుటుంబ సభ్యులకు కూడా తెలుసని అన్నారు. అలాగే అవినాష్ జైలుకెళితే నాయకత్వ సమస్య వస్తుందని చెప్పి, తనని వైసీపీలోకి ఆహ్వానిస్తున్నారని రవి బాంబ్ పేల్చారు.
అంటే బీటెక్ రవిని వైసీపీలోకి ఆహ్వానించారని తెలుస్తోంది. మరి రవి మాటల్లో ఎంత నిజం ఉందో గాని, ఆయన మాటలు ఇప్పుడు వైసీపీలో హాట్ టాపిక్ అయ్యాయి. మొత్తానికి కడప రాజకీయాలని ఒక మలుపు తిప్పారు.