పవన్ కల్యాణ్‌ నటిస్తున్న ఉస్తాద్ భగత్‌ సింగ్ నుంచి కొత్త షెడ్యూల్‌ అప్‌డేట్‌

-

పవన్ కళ్యాణ్ , హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ‘గబ్బర్ సింగ్’ వంటి బ్లాక్ బస్టర్ తరువాత వస్తున్న సినిమా కావడంతో ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎనర్జిటిక్ హీరోయిన్ శ్రీలీల ఈ సినిమాలో పవన్ కి జోడిగా నటిస్తుంది. ఈ మూవీ ఇటీవలే సెట్స్ పైకి వెళ్లిన విషయం తెలిసిందే. కేవలం ఎనిమిది రోజులోనే మొదటి షెడ్యూల్‌ పూర్తి చేసేసిన చిత్ర యూనిట్.. ఆ షెడ్యూల్ లో హై-వోల్టేజ్ యాక్షన్ సీన్స్, శ్రీలీలతో రొమాంటిక్ పార్ట్, పిల్లలతో వినోదభరితమైన సన్నివేశాలు, పోలీస్ స్టేషన్ సెట్‌లో మరికొన్ని కీలకమైన సీన్స్ ని తెరకెక్కించినట్లు తెలియజేశారు.

హరీష్‌ శంకర్‌ టీం తదుపరి షెడ్యూల్‌కు ప్రిపేర్‌ అవుతుండగా.. ఈ షెడ్యూల్‌ షూటింగ్‌ పూర్తిగా యాక్షన్‌ పార్టుతో సాగనుంది. ఇటీవలే ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ ఎడిటింగ్‌ వర్క్‌ కూడా మొదలైన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో శ్రీలీల ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తోన్న ఈ మూవీకి దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నాడు. తాజాగా ఓజీ సెట్‌ నుంచి పవన్‌ కల్యాణ్‌ స్టిల్‌ విడుదల చేయగా.. నెట్టింట హల్‌ చల్ చేస్తోంది. ఇటీవలే ఓజీ ముంబై షెడ్యూల్‌ పూర్తి చేసుకుంది. సుజిత్ టీం మొత్తం 45 రోజుల్లో ఓజీ షూట్‌ పూర్తి చేసేలా ప్లాన్ చేసినట్టు ఇన్‌సైడ్‌ టాక్‌.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version