రాజకీయాల్లో వ్యక్తి పూజలకు కాలం చెల్లిందని అనుకుంటున్నా.. ఇప్పటికీ ఎక్కడికక్కడ నాయకుల ఆధిప త్యమే కనిపిస్తోంది. నాయకుల ఆదిపత్యంలోనే నియోజకవర్గాలు, జిల్లాలు కూడా ఇప్పటికీ కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితి టీడీపీలో కంటే వైసీపీలోనే ఎక్కువగా ఉందని అంటున్నారు పరిశీలకులు. ముఖ్యంగా విజయనగరం జిల్లాలో వ్యక్తి ఆధిపత్య రాజకీయాలు నడుస్తున్నాయని తెలుస్తోంది. ఇక్కడ నుంచి మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణ.. ప్రభుత్వంలోనూ కీలక నాయకుడిగా ఉన్నారు. ప్రతిపక్షంపై కౌంటర్లు వేయ డంలోను, వారికి సమాధానం చెప్పడంలోనూ ఆయన ముందంజలో ఉన్నారు.
అయితే, అదేసమయంలో బొత్స రాజకీయాలు ఆయన సొంత జిల్లాలోనూ కొనసాగుతున్నాయి. ఇక్కడ ని యోజకవర్గాలకు నియోజకవర్గాలే బొత్స అండర్‌లో ఉన్నాయని తెలుస్తోంది. దీనికి కూడా కారణం ఉంది.. ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో విజయనగరంలో అంతాతానై వ్యవహరించారు బొత్స. ఇక్కడి తొమ్మిది నియో జకవర్గాల్లో వైసీపీని విజయతీరాలకు చేర్చడంలో ఆయనే కీలకంగా మారారు. అంతేకాదు, ఈ తొమ్మిది ని యోజకవర్గాల్లో ఆరింట్లో బొత్స బంధువర్గమే పోటీ చేసి విజయం దక్కించుకుంది. ఈ క్రమంలోనే ఇక్కడ బొత్స మాటకే అంతా వాల్యూ! అయితే, ఎక్కడైనా ఒకరిద్దరు ఇలాంటి వారికి ఎగెనెస్ట్‌గా ఉండేవారు కూడా ఉంటారు కదా!!
అలాంటి వారిలో ఒకరిద్దరు బొత్సను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆయన ఆధిపత్యం ఏంటి? అని ప్రశ్నిం చేవారు కూడా ఉన్నారు. అంతేకాదు, వైసీపీలో కీలక నేతగా ఉన్న కోలగట్ల వీరభద్రస్వామికి మంత్రి పదవి దక్కాల్సి ఉంది. అయితే, బొత్స దీనికి అడ్డుపడ్డారనేది బహిరంగ రహస్యం. ఇక్కడ తనతోపాటు మరో వ్యక్తి మంత్రిగా ఉంటే.,. తన మాట వినేదెవ్వరని భావించిన ఆయన కోలగట్లకు తప్ప ఎవరికైనా ఇచ్చుకోండి! అని ఆయన అనడంతోనే ఈ కోటా పదవి.. విజయవాడకు చెందిన వెలంపల్లికి దక్కింది. దీంతో కోలగట్లకు బొత్సపై గొంతు వరకు విభేదం ఉంది.
అయితే, ఇప్పుడు ప్రభుత్వంలోను, జిల్లాలోనూ బొత్స కీలకంగా ఉండడంతో ఆయన మౌనంగా భరిస్తున్నారు. ఇక, బొత్స కూడా ఎలాంటి సమస్య వచ్చినా తనదైన శైలిలో పరిష్కరిస్తూ.. ముందుకు సాగుతున్నారు. ఈ కారణంగా ఇప్పటి వరకు ఈ వ్యతిరేకత బయటకు రాకపోయినా.. ఎప్పటికైనా బొత్సపై ఉన్న వ్యతిరేకత భళ్లు మనక మానదని అంటున్నారు పరిశీలకులు., ఒక్క కోటగట్లే కాకుండా బొత్స వైఖరిని వ్యతిరేకిస్తున్న వారిలో ఇప్పుడు మౌనం ఉన్నా.. త్వరలోనే వారు బయటపడక తప్పదని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.