రాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి వ్యూహాలు వేయాల్సి వస్తుందో చెప్పడం కష్టం. ముఖ్యంగా పార్టీని కాపాడు కునేందుకు, ప్రత్యర్థుల ఊపు నుంచి తమను తాము రక్షించుకునేందుకు పార్టీల అధినేతలు అనేక వ్యూ హాలు, ప్రతివ్యూహాలు వేసుకుంటారు. ఈ క్రమంలో ఒక్కొక్కసారి ఈ వ్యూహ ప్రతివ్యూహాలు వికటించే ప్రమా దం కూడా లేకపోలేదు. అయితే, దీనిని ముందుగానే ఊహించి ఉంటే.,. ఇప్పుడు ఇలా ఈ స్టోరీ గురించి చెప్పుకొనే అవకాశం లేకపోయేది. విషయంలో కివెళ్తే.. టీడీపీలో బలమైన వర్గం కమ్మ సామాజిక వర్గం. పార్టీకి ఊపిరి వీరే. నిలబెట్టింది, అధికారంలోకి వచ్చేలా చేసింది కూడా వీరే.
చిత్రం ఏంటంటే.. పార్టీలో ఉండే కమ్మలతో పాటు.. బయట పార్టీకి సంబంధంలేని కొందరు మీడియా అధినేతలు కూడా టీడీపీకోసం ఎంతో కృషి చేశారు. చేస్తున్నారు. వీరి జాబితా టీడీపీలో ఎక్కువగానే ఉంది. పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు పార్టీనే అంటిపెట్టుకున్న నాయకులు కమ్మ వర్గంలో ఎక్కువగానేఉన్నారు. ఎన్టీఆర్ నుంచి మొదలుకుని ఇప్పుడు ఉన్న వల్లభనేని వంశీ, దేవినేని ఉమా, దేవినేని నెహ్రు, కరణం బలరాం, ధూళిపాళ్ల నరేంద్ర, బుచ్చయ్య చౌదరి, పరిటాల రవి, కోడెల శివప్రసాద్ ఇలాంటి ఎందరో కమ్మ సామాజిక వర్గ నేతలు పార్టీకి అండగా నిలబడ్డారు.
కమ్మం వర్గం అండదండలతోనే చంద్రబాబు పాలన మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగింది. అయి తే, రాజకీయాలు ఇలా నల్లేరుపై నడకలా సాగితే..రుచి పచి ఏముంటాయి. ఈ క్రమంలోనే రాజకీయాల్లో ఎంటరైన జనసేనాని పవన్ ఎక్కడ ప్రభంజనం సృష్టిస్తాడోనని చంద్రబాబు తెగ ఫీలయ్యారు. ముఖ్యంగా టీడీపీకి కంచుకోటలుగా ఉన్న ఉభయ గోదావరి జిల్లాల్లో కాపులు 2014లో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు అయ్యేందుకు ఎంతో సహకరించారు.
అయితే, ఇప్పుడు వీరంతా కూడా పవన్ వెంట ఎక్కడ వెళ్లిపోతారో, తన అదికారం ఎక్కడ ఊడిపోతుందోనని భావించిన చంద్రబాబు.. ఎన్నికలకు ముందు.. అనూహ్యంగా కాపులకు ప్రాధాన్యం పెంచేశారు. పోనీ.. అదే రేంజ్‌లో పార్టీకి చెవులు, కళ్లు వంటి కమ్మలను పట్టించుకున్నారా? అంటే.. వారిని పూర్తిగా పక్కన పెట్టి.. పవన్ బెడద నుంచి కాపు వర్గాన్ని తనవైపు తిప్పుకొనే ప్రయత్నంలో వారికే ప్రాధాన్యం ఇచ్చారు. దీంతో కమ్మలకు అప్పటి వరకు ఉన్న ప్రాధాన్యం పూర్తిగా తగ్గిపోయింది.
కాపు ఓటు బ్యాంకు ని దగ్గర చేసుకునే ప్రయత్నంలో భాగంగా చంద్రబాబు… ఎక్కువగా వారికి న్యాయం చేశారు. పదవుల్లో కూడా వారికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. దీంతో కమ్మల్లో బాబుపై అంతర్గతంగానే వ్యతిరేక తప్రారంభమైంది. ఇది ఆయనకే కాకుండా పార్టీకి కూడా చేటు తెచ్చేందుకు రెడీ అయిందని ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. కేవలం కాపుల కోసమే టీడీపీ ఉన్నట్టుగా గడిచిన రెండేళ్లు చంద్రబాబు వ్యవహరించడాన్ని కమ్మవర్గం సహించలేక పోతోంది.
పైగా ఎన్నికల్లో ఓటమి తర్వాత కూడా కమ్మ వర్గాన్ని బాబు పట్టించుకోలేదు. దీనికి కోడెల ఆత్మహత్య ప్రబల ఉదాహరణగావారు చర్చించుకుంటున్నారు. ఇక, చింతమనేనిపై అనేక కేసులు చంద్రబాబు హయాంలోనే నమోదయ్యాయి. వాటిపై ఇప్పుడు చర్యలు తీసుకుంటున్నారు. అప్పట్లోనే కేసులకు అడ్డుకట్ట వేసి ఉంటే.. ఇప్పుడు ఈ కేసులు ఉండేవి కాదనే అభిప్రాయం చింతమనేని వర్గంలో ఉంది. ఏతా వాతా.. కమ్మ వర్గం టీడీపీకి సైలెంట్‌గా దూరం జరుగుతోంది. దీనికి ఎవరిని నిందించినా.. చంద్రబాబుకు ప్రయోజనం ఏమీ ఉండదని అంటున్నారు పరిశీలకులు.