ఇక నుంచి జూమ్ లో పెళ్లి చేసుకోవచ్చు…!

-

ఇప్పుడు కరోనా కారణంగా వేలాది పెళ్ళిళ్ళు ఆగిపోయిన సంగతి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు అన్ని దేశాలు కూడా పెళ్ళికి అనుమతి ఇవ్వడం లేదు. పెళ్లి అంటే ఒకరు ఇద్దరితో పూర్తి అయిపోయే తంతు కాదు కాబట్టి చాలా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి. కరోనా కారణంగా లాక్ డౌన్ ని పక్కాగా అమలు చేస్తున్న ప్రభుత్వాలు ఎలాంటి పరిస్థితిలో కూడా పెళ్లి కార్యక్రమాలకు అనుమతి లేదని చెప్తున్నాయి.

దీనితో ఈ మధ్య కాలంలో ఆన్లైన్ పెళ్ళిళ్ళు కూడా జరుగుతున్నాయి. పెళ్లి కార్యక్రమాలను, ఇతరత్రా కార్యక్రమాలను ఆన్లైన్ లో నిర్వహిస్తున్నారు. తాజాగా న్యూయార్క్ లో ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి జూమ్ యాప్ లో పెళ్లిళ్లకు అనుమతి ఇవ్వాలి అని భావించారు. కరోనా వ్యాప్తితో పెళ్ళిళ్ళు ఆగిపోయి ఇప్పుడు ఎందరో ఒంటరి జీవితాలను గడపలేక ఇబ్బందులు పడే పరిస్థితి.

దగ్గరి బంధువులు కూడా హాజరుకాలేని పరిస్థితుల్లో పెళ్లిళ్లను వాయిదా వేస్తున్నారు. దీనితో… న్యూయార్క్‌ గవర్నర్‌ ఆండ్రూ క్యూమో ఒక కీలక నిర్ణయా౦ తీసుకున్నారు. జూమ్‌ యాప్‌లో పెళ్లి కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి అనుమతి ఇస్తున్నట్టు చెప్పారు. దీనికి చట్టబద్దత కూడా కల్పిస్తామని చెప్పారు. కాగా న్యూయార్క్ లో కరోనా కారణంగా 18 వేల మంది చనిపోయారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version