బీరువాలో బట్టల నుండి దుర్వాసన రాకూడదంటే.. ఇలా చేయండి…!

-

మనం బీరువాలో అల్మారా లో బట్టల్ని ఫోల్డ్ చేసి ఉంచుతాము. అయితే బట్టలు ఒక్కొక్కసారి మంచి వాసన రావు. దుర్వాసన బట్టలు నుండి వస్తుంది. దుమ్ము ధూళి తో పాటుగా ఎలుకలు కీటకాలు ఇలాంటి వాటి వలన దుస్తులని దుర్వాసన వచ్చేలా చేస్తాయి కొన్నిసార్లు బీరువాలో పెట్టిన బట్టలు కూడా వాసన వస్తూ ఉంటాయి. ఇలాంటి వాసనని పోగొట్టాలంటే ఈ విధంగా పాటించండి ఇలా చేశారంటే మీ బీరువాలో బట్టలు సువాసన కలిగి ఉంటాయి దుర్వాసన వాటి నుండి రాదు.

నాప్తలీన్ బాల్స్ ని బీరువాలో పెట్టడం వలన మంచి వాసన వస్తుంది చెడు వాసన రాదు వీటిని బీరువాలో పెడితే బొద్దింకలు కీటకాలని కూడా నివారించవచ్చు. కాబట్టి బీరువాలో మీరు వీటిని పెడుతూ ఉండండి. చందనం పొడి పెడితే కూడా మనిషి వాసన వస్తుంది. బీరువాలో పెట్టిన దుస్తుల వాసన బాగుండాలంటే చందనం చెక్క పొడిని పేపర్లో చుట్టి ఒక మూల పెట్టండి అప్పుడు మంచి వాసన వస్తుంది. తులసి నూనెను కూడా మీరు ఉపయోగించవచ్చు తులసి నూనెని ఒక వస్త్రానికి పట్టించి దానిని బీరువాలో ఒక మూలపెట్టండి. దీని వలన మంచి పరిమళం వస్తుంది. దుర్వాసన బట్టల నుండి రాదు.

అదేవిధంగా సువాసన నూనెలని కూడా మీరు ఉపయోగించవచ్చు వీటివలన కూడా బట్టలకి మంచి వాసన వస్తుంది. దుర్వాసన రాదు. సబ్బులని కూడా మీరు పెట్టొచ్చు బీరువా నుండి మంచి వాసన రావాలంటే చిన్న సబ్బులని పెట్టండి. అలానే కాఫీ గింజలను పెడితే కూడా మంచి వాసన వస్తుంది. సేంట్ వంటివి కూడా మీరు పెట్టొచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version