మంత్రి జోగి రమేష్ కు నిరసన సెగ

-

అంబేద్కర్ కోనసీమ: అమలాపురంలో మంత్రి జోగి రమేష్ కు నిరసన సెగ తగిలింది. జిల్లా ఇంచార్జ్ మంత్రి, రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ కు నిరసన తెలపడానికి సిద్ధమయ్యారు జనసేన శ్రేణులు. దీంతో జనసేన శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. వారి వద్ద ఉన్న జనసేన జెండాలు, దిష్టిబొమ్మను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. పవన్ కళ్యాణ్ ను ఇటీవల మంత్రి జోగి రమేష్ తీవ్రంగా విమర్శించిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలు నిరసన తెలుపవచ్చనే అనుమానంతో జోగి రమేష్ అమలాపురం పర్యటనకు పోలీసు బందోబస్తును పెంచుకున్నారు. గడియార స్థంభం సెంటర్ లో పోలీసులు పెద్ద ఎత్తున మొహరించారు. అమలాపురం మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరకానున్న నేపథ్యంలో మంత్రి జోగి రమేష్ ని అడ్డుకునే ప్రయత్నం చేశారు జనసేన కార్యకర్తలు.

Read more RELATED
Recommended to you

Exit mobile version