PAK VS NZ ODI SERIES : భారీ లక్ష్య ఛేదనలో చేతులెత్తేసిన కివీస్… !

-

ప్రస్తుతం పాకిస్తాన్ పర్యటనలో ఉన్న న్యూజిలాండ్ కు ఏదీ కలిసి రావడం లేదు అని చెప్పాలి. ఈ పర్యటనలో భాగంగా అయిదు టీ 20 లు మరియు అయిదు వన్ డే లు ఆడాల్సి ఉండగా… ముగిసిన టీ 20 సిరీస్ ను కివీస్ డ్రా తో సరిపెట్టుకుంది. కాగా వన్ డే సిరీస్ లో ఇప్పటికే నాలుగు వన్ డే లు పూర్తి అయ్యాయి. నాలుగింటిలోనూ కివీస్ ఓడిపోయి ఇప్పటికే సిరీస్ ను పోగొట్టుకోగా.. కనీసం ఒక్క మ్యాచ్ అయినా గెలిచి పరువు కాపాడుకోవాలన్న కుదిరేలా లేదు. గత రాత్రి జరిగిన నాలుగవ వన్ డే లో పాకిస్తాన్ 102 పరుగుల తేడాతో కివీస్ ను చిత్తుగా ఓడించింది. పాక్ ఇచ్చిన పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో కివీస్ కేవలం 232 పరుగులకే ఆల్ అవుట్ అయింది.

దీనితో నాలుగవ మ్యాచ్ ఓడిపోయి సిరీస్ లో 0 -4 కు పడిపోయింది. ఈ మ్యాచ్ లో సెంచరీ తో ఉత్తమ ప్రదర్శన కనబరిచి మ్యాన్ అఫ్ ది మ్యాచ్ గా కెప్టెన్ బాబర్ అజాం ఎంపికయ్యాడు. ఇక మిగిలిన మరో మ్యాచ్ లో న్యూజిలాండ్ రేపు ఆడనుంది, కాగా ఈ మ్యాచ్ లో అయినా గెలిచి విజయంతో సిరీస్ ను ముగిస్తారా చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version