రాయ‌ల‌సీమ ఎత్తిపోత‌ల ప‌థ‌కం..జ‌గ‌న్ స‌ర్కార్‌కు ఎన్జీటీ షాక్‌

-

జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌ర్కార్ కు మ‌రో దిమ్మ తిరిగే షాక్ త‌గిలింది. రాయ‌ల సీమ ఎత్తి పోత‌ల ప‌థ‌కం పై శుక్ర వారం రోజున ఎన్జీటీ తీర్పును వెలువ‌రించింది. కేంద్ర ప‌ర్యావ‌ర‌ణ అనుమ‌తులు లేకుండా రాయ‌ల సీమ ఎత్తి పోత‌ల ప‌థ‌కం నిర్మాణం చేప‌ట్ట‌రాద‌ని ఎన్జీటీ స్ప‌ష్టం చేసింది. ప్రాజెక్టు నిర్మాణంలో అధ్య‌య‌నానికి నిపుణుల క‌మిటీని ఎన్జీటీ ఏర్పాటు చేసింది.

నాలుగు నెల‌ల్లో క‌మిటీ… నివేదిక ఇవ్వాల‌ని ఆదేశాలు జారీ చేసింది ఎన్జీటీ. ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర సీఎస్ పై కోర్టు ధిక్కారం చ‌ర్య‌లు అవ‌స‌రం లేద‌ని పేర్కొంది ఎన్జీటీ. నిబంధ‌న‌లు ఉల్ల‌ఘించి.. నిర్మాణం చేప‌డితే.. ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌భుత్వం బాధ్య‌త వ‌హించాల‌ని స్ప‌ష్టం చేసింది ఎన్జీటీ. దీంతో ఏపీ స‌ర్కార్ కు ఊహించ‌ని ఎదురు దెబ్బ ఎదురైంది. కాగా.. రాయ‌ల‌సీమ ఎత్తి పోత‌ల ప‌థ‌కం పై రెండు తెలుగు రాష్ట్రల మ‌ధ్య వివాదం చెల‌రేగుతున్న సంగ‌తి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version