కోయంబత్తూరు బ్లాస్ట్ కేసు.. తమిళనాడులో ఎన్‌ఐఏ దాడులు

-

కోయంబత్తూరు సిలిండర్‌ బ్లాస్ట్‌ కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా నిన్ అర్ధరాత్రి నుం చి తమిళనాడులో సోదాలు చేస్తోంది. 45 ప్రాంతాల్లో ఎన్‌ఐఏ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి అనుమానితులు, వారికి సంహకరించిన వారి ఇళ్లను తనిఖీ చేస్తున్నారు. చెన్నైలోని పుడుపెట్‌, మన్నాడి, జమాలియా, పెరంబూరుతోపాటు కోయంబత్తూరు, కొట్టయ్‌మేడు, ఉక్కడం, పొన్విఝా నగర్‌, రతినపురి తదితర ప్రాంతాల్లో ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి.

అక్టోబర్‌ 23న ఉదయం 4.30 గంటల సమయంలో తమిళనాడు కోయంబత్తూరులోని కొట్టే సంగమేశ్వర ఆలయం ముందు మారుతి కారులో ఉన్న సిలిండర్‌ పేలిపోయింది. ఈ ఘటనలో ఒకరు చనిపోగా మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. పేలుడు సంభవించిన ప్రాంతంలో బేరింగ్‌ బాల్స్‌, గాజుపెంకులు, అల్యూమినియం మేకులు కనిపించండంతో అనుమానాలకు తావిచ్చింది. ఈ పేలుడులో ఉగ్రకోణం ఉందని పోలీసులు నిర్ధారించారు. దీంతో అదే నెల 27న రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును ఎన్‌ఐఏకి అప్పగించింది. ఇప్పటికే ఈ కేసులో ఐదుగురు యువకులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version