ముంబై దాడుల సూత్రధారి తహవూర్ రాణా కేసు లో ట్విస్ట్ చోటు చేసుకుంది. ముంబై దాడుల సూత్రధారి తహవూర్ రాణాకు NIA కస్టడీ విధించింది. 18 రోజుల కస్టడీకి అప్పగించిన పాటియాలా కోర్టు… ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. భారీ భద్రత మధ్య తహవుర్ రాణాను కోర్టులో హాజరుపరిచింది NIA. రాణాను 20 రోజుల కస్టడీకి కోరగా 18 రోజుల కస్టడీకి అనుమతించింది కోర్టు.

కాగా 26/11 ముంబయి ఉగ్రదాడి సూత్రధారి తహవూర్ రాణాను ఎట్టకేలకు అమెరికా నుంచి భారత్‌కు తీసుకొచ్చారు. ప్రత్యేక విమానంలో ఢిల్లీ ఎయిర్ పోర్టుకు చేరుకున్న రాణాను అధికారులు భారీ భద్రత నడుమ జాతీయ దర్యాప్తు సంస్థ కేంద్ర కార్యాలయానికి తరలించారు. అయితే రాణా భారత్ కు వచ్చాడని తెలుసుకున్న భారతీయులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. తమ దేశంలో అల్లకల్లోలం సృష్టించాలని ప్రయత్నించి.. ఎంతో మంది ప్రాణాలు పొట్టన పెట్టుకున్న రాణాను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.