రెండు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు బిగ్ అలర్ట్. ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ రాష్ట్రాలకు మూడు రోజులపాటు వర్షాలు ఉన్నట్లు…. వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. బంగాళాఖాతంలో అల్పపీడనం బలహీనపడుతోంది. అయినప్పటికీ రానున్న మూడు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.
ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని ఉత్తర భాగంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, చిత్తూరు, తిరుపతి జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి. ఇక కోస్తా జిల్లాలో ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి.
- బంగాళాఖాతంలో బలహీనపడుతున్న అల్పపీడనం
- రానున్న మూడు రోజుల్లో ఏపీలో తేలికపాటి వర్షాలు
- శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, చిత్తూరు, తిరుపతి జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
- ఇక కోస్తా జిల్లాలో పెరగనున్న ఉష్ణోగ్రతలు
- ఇటు తెలంగాణలో రెండు రోజుల పాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం