తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. తెలంగాణ రాష్ట్రంలో భూకంప హెచ్చరికలు జారీ చేసింది ఎపిక్ ఎర్త్ క్వేక్ రీసెర్చ్ సంస్థ. రామగుండం ప్రాంతంలో భూకంపం సంభవించే అవకాశం ఉన్నట్లు వార్నింగ్ ఇచ్చింది. రామగుండం ప్రాంతంలో సింగరేణి తవ్వకాలు జరుగుతాయి. భూమికి స్వరంగం చేసి మరి తవ్వకాలు చేస్తూ ఉంటారు.

అందుకే అక్కడ భూకంపం సంభవించే ప్రమాదం పొంచి ఎర్త్ క్వేక్ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. ఈ భూకంప ప్రకంపనలు హైదరాబాద్, వరంగల్ జిల్లాతో పాటు అమరావతి, మహారాష్ట్ర వరకు చేరే అవకాశం ఉందని కూడా తెలిపింది. కాబట్టి ప్రజలంతా చాలా జాగ్రత్తగా ఉండాలని వివరించింది.
- తెలంగాణకు భూకంప హెచ్చరిక ?
- రామగుండం ప్రాంతంలో భూకంపం సంభవించే అవకాశం ఉందని హెచ్చరించిన “ఎపిక్ ఎర్త్ క్వేక్ రీసెర్చ్ సంస్థ”
- ఈ భూ ప్రకంపనలు హైదరాబాద్, వరంగల్, అమరావతి, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర వరకు చేరే అవకాశం ఉందని హెచ్చరించిన ఎపిక్ సంస్థ