పుష్ప తో సుకుమార్ మరియు అల్లు అర్జున్ కాంబోలో మరో ఘనవిజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఇచ్చిన విజయంతో సీక్వెల్ ను కూడా చేస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా దాదాపుగా చివరి దశలో ఉంది. అయితే గత కొద్ది రోజుల నుండి ఈ సినిమాకు సంబంధించిన ఒక వార్త చక్కర్లు కొడుతోంది. ఇందులో మెగా డాటర్ నిహారిక ఒక కీలక పాత్రలో నటిస్తోందని వార్తలు వచ్చాయి. కాగా ఈ వార్తపై తాజాగా నిహారిక తన లేటెస్ట్ వెబ్ సిరీస్ డెడ్ ఫిక్సల్స్ ప్రమోషన్ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ సినిమా ఛాన్సులు వస్తే తప్పకుండా నటిస్తానని.. కాగా నాపై వస్తున్న పుష్ప నటిస్తున్నానన్న వార్తలలో ఎటువంటి వాస్తవం లేదని నిహారిక క్లారిటీ ఇచ్చింది.