ప్రభాస్ తో పెళ్లిపై నిహారిక ఏం అందంటే…!

-

టాలీవుడ్ జనాలు ప్రభాస్ పెళ్లి గురించి మాట్లాడుకునే విధంగా మరో సమస్య గురించి కూడా మాట్లాడుకునే పరిస్థితి లేదు అనే చెప్పాలి. ఏదోక వార్త ప్రభాస్ పెళ్లి గురించి సోషల్ మీడియాలో వస్తూనే ఉంది. అనుష్క తో పెళ్లి అని కాజల్ తో పెళ్లి అని బాలీవుడ్ హీరోయిన్ తో అని భీమవరం అమ్మాయితో పెళ్లి అని ఏదోక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వశునే ఉంది. కాని ప్రభాస్ మాత్రం సినిమాలే చేస్తున్నాడు.

ఇక ఈ మధ్య మెగా హీరోయిన్ నిహారిక తో పెళ్లి జరుగుతుందని వాళ్ళు ఇద్దరూ ప్రేమలో ఉన్నారని వార్తలు వచ్చాయి. అది నిజం కాకపోయినా సరే ఏదోక విధంగా దీన్ని ప్రచారం చేస్తున్నారు జనాలు. దీనిపై నిహారిక స్పందించింది. అసలు అది నిజం కాదని స్పష్టం చేసింది. ఆన్లైన్ లో లైవ్ లో పాల్గొన్న నిహారిక అభిమానులు అడిగిన ప్రశ్నలకు గానూ సమాధానం చెప్పింది. ఈ సందర్భంగా ప్రభాస్ పెళ్లి ప్రస్తావన వచ్చింది.

మీరు ప్రభాస్ ని పెళ్లి చేసుకుంటున్నారా అక్కా అని అడగగా దానికి సమాధానం ఇచ్చింది. అసలు అది నిజం కాదని స్పష్టం చేసింది. తనకు ప్రభాస్ కి మధ్య ఏ ప్రేమ లేదని పేర్కొంది. మిమ్మల్ని నిరాశపరుస్తున్నందుకు క్షమించండి. ఆ వార్తలన్నీ అవాస్తవాలు. నేను ప్రభాస్‌ను లవ్ చేయడం, పెళ్లి చేసుకోవడం నిజం కాదు అని వివరించింది. తన ఫ్యామిలీ లో తన బావ వైష్ణవ తేజ్ బాగా క్లోజ్ అని చెప్పింది నిహారిక.

Read more RELATED
Recommended to you

Exit mobile version