గెస్ట్ రోల్స్ కే పరిమితవుతున్న “కుమారి” హెబ్బా పటేల్ ..!

-

హెబ్బా పటేల్ .. కుమారి 21 ఎఫ్ సినిమా చూసిన తర్వాత అందరూ టాలీవుడ్ లో యంగ్ హీరోస్ సినిమాలలో నటిస్తూ చాలా కాలం ఇండస్ట్రీలో కొనసాగుతుందనుకున్నారు. వాస్తవంగా హెబ్బా పటేల్ అలా ఎలా అన్న సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైనప్పటికి సుకుమార్ నిర్మాణం లో వచ్చిన కుమారి 21 ఎఫ్ తోనే బాగా పాపులర్ అయింది. ఆ తర్వాత వరసగా కొన్ని సినిమాలు చేసింది. కాని ఆ సినిమాలు కుమారి 21 ఎఫ్ అంతటి ఘన విజయం సాధించలేదు.

 

ఈడో రకం ఆడో రకం, నాన్నా నేను నా బాయ్ ఫ్రెండ్, ఎక్కడికి పోతావు చిన్నవాడ, ఏంజిల్, మిస్టర్, అంధగాడు, 24 కిసెస్ ..ఇలా అన్ని పెద్ద సినిమాలు అయినప్పటికి అన్ని యావరేజ్ హిట్స్ గా నిలిచాయి. ముఖ్యంగా ఎన్నో ఆశలు పెట్టుకొని విపరీతమైన లిప్ లాక్స్ ఇచ్చిన 24 కిసెస్ కూడా హెబ్బా పటేల్ కి సక్సస్ ని ఇవ్వలేకపోయింది. దాంతో దాదాపు టాలీవుడ్ లో కెరీర్ క్లోజ్ అయినట్టే అనిపిస్తుంది. దాంతో వచ్చిన చిన్నా చితకా క్యారెక్టర్స్ ని ఐటం సాంగ్స్ ని ఒప్పుకొని మళ్ళీ మేకర్స్ ఛాన్స్ ఇస్తారేమో అన్న ఆశతో ఉంది.

 

ప్రస్తుతం రామ్‌ హీరోగా నటిస్తున్న ‘రెడ్’ సినిమాలో హెబ్బా పటేల్ ఐటమ్ సాంగ్ తో పాటు చిన్న గెస్ట్ రోల్ లో నటించింది. రీసెంట్ గా వచ్చిన నితిన్ భీష్మ సినిమాలోను హెబ్బా గెస్ట్ రోల్ చేసింది. ఇలా బ్యాక్ టు బ్యాక్ భీష్మ, రెడ్ సినిమాలలో కూడా గెస్ట్ రోల్ లో నటిస్తున్నప్పటికి హెబ్బా పటేల్ కి హీరోయిన్ ఛాన్స్ మాత్రం రావడం లేదు. అందుకోసమే బాగా ప్రయత్నాలు చేస్తుందట. మరి గెస్ట్ రోల్స్, ఐటం సాంగ్స్ ఈ కుమారి హెబ్బా పటేల్ ని ఆదుకుంటాయో లేదో చూడాలి అంటున్నారు ఫ్యాన్స్.

ఇక తిరుమల కిషోర్‌ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్‌ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్‌ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా కరోనా దెబ్బకు సినిమా రిలీజ్ డేట్ పోస్ట్ ఫోన్ అయింది. కాగా ఈ సినిమాలో రామ్ సరసన నివేదా పేతురాజ్ నటిస్తున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తుండగా సమీర్‌ రెడ్డి ఛాయాగ్రహణం అందిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version