గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో మెగా డాటర్ నిహారిక కొణిదెల

-

తెలంగాణలో పచ్చదనం వెల్లివిరియాలనే ఉద్దేశంతో రాజ్యసభ ఎంపీ సంతోశ్ కుమార్‌ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే సామాన్యుల నుంచి రాజకీయ నాయకులు, సినీప్రముఖులు మొక్కలు నాటారు. వారు మొక్కలు నాటడమే కాకుండా వారి సన్నిహితులు, స్నేహితులకు మొక్కలు నాటాలని ఛాలెంజ్ విసిరారు.

తాజాగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో మెగా డాటర్, నాగబాబు కూతురు నిహారిక కొణిదెల పాల్గొన్నారు. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్ జీహెచ్‌ఎంసీ పార్కులో మొక్కలు నాటారు. మొక్కలు నాటిన తర్వాత నిహారిక సెల్ఫీ తీసుకున్నారు. అనంతరం ఆ మొక్కలతో కలిసి ఫొటోలు దిగి సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు.

గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటడం ఆనందంగా ఉందని నిహారిక అన్నారు. తన తండ్రి నాగబాబు ఎప్పుడు ప్రకృతిని ప్రేమించాలని, మొక్కలు పెంచాలని చెబుతూ ఉంటారని చెప్పారు.  గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఇలాగే నిరంతరం కొనసాగాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరు ఈ ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటాలని కోరారు. ఈ అవకాశం కల్పించిన ఎంపీ సంతోశ్ కుమార్‌కు నిహారిక కృతజ్ఞతలు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version