జర్నలిస్టులకి ఆ పాలసి తీసుకురండి : ఎమ్మెల్యే కునంనేని

-

ప్రభుత్వం నిజమైన జర్నలిస్టులను గుర్తించి.. వారి సంక్షేమం కోసం ఒక పాలసీ తీసుకురావాల్సిన అవసరముందని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు. తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సమావేశాలలో భాగంగా ఎమ్మెల్యే కూనంనేని తెలంగాణలో జర్నలిస్టుల గురించి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం జర్నలిస్టుల గురించి ఒక కమిటీ వేస్తే బాగుంటుందని సూచించారు. నిజమైన జర్నలిస్టులు ఎంత మంది ఉన్నారు.. వారి జీవితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

అందులో పెద్ద పత్రికల్లో పని చేసే వారు ఎంత మంది..? నగరాల్లో పని చేసే వారు ఎంతమంది..? గ్రామాల్లో పని చేసే వారు ఎంత మంది ఉన్నారో తెలుసుకోవాలన్నారు. జర్నలిస్టుల పేరుతో సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసేవారిని, బెదిరింపులకు గురి చేసే వారిని, బ్లాక్ మెయిల్ చేసే వారిని స్క్రీనింగ్ చేయాలని సూచించారు. అదేవిధంగా మంచి జర్నలిస్టులను గుర్తించి వారికి ఆరోగ్యం, చదువులు, పెన్సన్, ఇళ్లు లాంటివి ఇచ్చేలా వారి సంక్షేమం కోసం మంచి పాలసీ తీసుకొని రావాలని సీఎం రేవంత్ రెడ్డి కి విజ్ఞప్తి చేశారు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version