ప్రపంచ బాక్సింగ్​ ఛాంపియన్​షిప్​​.. క్వార్టర్స్​లోకి నిఖత్ జరీన్

-

తెలంగాణ స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ ప్రపంచ మహిళల బాక్సింగ్​ ఛాంపియన్​షిప్​లో మరోసారి తన సత్తా చాటుతోంది. టైటిల్‌ను నిలబెట్టుకునే దిశగా ఈ తెలంగాణ పిల్ల మరో అడుగు ముందుకేసింది. మంగళవారం జరిగిన 50 కేజీల ప్రీక్వార్టర్స్‌లో ఆమె 5-0తో ప్యాట్రిసియా అల్వరెజ్‌ (మెక్సికో)ను చిత్తు చేసింది. ఆరంభం నుంచి పంచ్‌ పవర్‌ చూపించిన నిఖత్‌.. ప్రత్యర్థి ప్యాట్రిసియాకు అవకాశమే ఇవ్వలేదు. ప్రతి రౌండ్లోనూ న్యాయ నిర్ణేతలంతా నిఖత్‌కే ఓటేయడంతో ఆమె ఘన విజయాన్ని అందుకుంది.

 ఆదివారం దిల్లీలోని కేడీ జాదవ్​ స్టేడియంలో జరిగిన మ్యాచ్​లో ఆఫ్రికన్​ ఛాంపియన్ అల్జీరియాకు చెందిన బౌలమ్​ రౌమైసాతో తలపడింది నిఖత్.​ 5-0 ఏకపక్ష స్కోర్​తో ప్రత్యర్థిని ఓడించి ప్రీ-క్వార్టర్స్ ఆడింది. మ్యాచ్​ ఆరంభంలో బాక్సర్లు ఇద్దరూ ఎంతో ఆచితూచి జాగ్రత్తగా ఆడారు. అయితే ఆట మొదటి రౌండ్​లో నిఖత్​కు తన ఆటతీరుతో విజృంభించింది. దీంతో ఆ రౌండ్​ ఆమెకు అనుకూలంగా మారినట్లయింది. చివరకు 5-0తో వార్​ వన్​ సైడ్​ చేసి విజేతగా నిలిచింది నిఖత్​ జరీన్​.

Read more RELATED
Recommended to you

Exit mobile version