వరల్డ్ బ్యాక్సింగ్ చాంపియన్‌గా హైదరాబాదీ యువ బాక్సర్ నిఖత్ జరీన్ చరిత్ర సృష్టించింది. మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌గా అవతరించారు. గురువారం రాత్రి జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఘన విజయం సాధించారు. థాయ్‌ల్యాండ్‌కు చెందిన జిట్‌పాంగ్‌ను చిత్తు చేశారు. దాంతో ఉమెన్స్ వరల్డ్ బాక్సింగ్ చాంపియన్‌గా అవతరించారు. ఈమె స్వస్ధలం తెలంగాణలో గల నిజామాబాద్.. నిఖత్ రాజకీయ ప్రముఖులు అభినందనలు తెలియజేస్తున్నారు.
మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భాగంగా 52 కిలోల విభాగంలో సత్తా చాటుతూ సాగిన నిఖత్… తన జోరును ఫైనల్ మ్యాచ్‌లోనూ కొనసాగించింది. ఫైనల్‌లో జిట్ పాంగ్‌పై పంచ్‌ల వర్షం కురిపించిన నిఖత్ లాస్ట్ పంచ్ కూడా తనదేనన్నట్లుగా చెలరేగింది. జిట్ పాంగ్ ను ఏకంగా 5-0 తేడాతో చిత్తు చేసింది. ఫైనల్ మ్మాచ్‌లో విజయం సాధించిన నిఖత్ స్వర్ణ పతకాన్ని సాధించి 52 కిలోల విభాగంలో వరల్డ్ బాక్సింగ్ చాంపియన్‌గా చరిత్ర సృష్టించింది.