కరోనా వైరస్ ఎంతలా విజృంభిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జన జీవనం స్తంభించేలా చేస్తోన్న కరోనాను ఎదుర్కొనేందుకు కట్టుదిట్టమైన చర్యలను చేస్తోంది ప్రభుత్వం. జనాలు గుంపులు గుంపులుగా ఉండే ప్రదేశాలైన థియేటర్లు, కాలేజీలు, స్కూళ్లు, మాల్స్, పబ్స్, క్లబ్స్ వంటి వాటిని మూసి వేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయే పరిస్థితి వచ్చింది. పెళ్లిళ్లు కూడా ఆగే పరిస్థితి వచ్చింది.
ఈ క్రమంలో టాలీవుడ్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ అయిన నితిన్ , నిఖిల్ వంటి హీరోలు వివాహానికి ముహూర్తాన్ని ఫిక్స్ చేసుకున్నారు. అయితే వీటిలో నితిన్ డెస్టినేషన్ వెడ్డింగ్‌లో భాగంగా దుబాయ్‌లో ఫిక్స్ చేశాడు. అయితే కరోనా కారణంగా పెళ్లి వాయిదా పడట్టు తెలుస్తోంది. మరోవైపు నిఖిల్ పెళ్లి కూడా వాయిదా పడ్డట్టు సమాచారం. అయితే ఈ వార్తలపై స్పందించాడు నిఖిల్.
హీరో నిఖిల్.. డాక్టర్ పల్లవిని ఏప్రిల్ 16న పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. కరోనా కాదు కదా.. ఏదీ తనను ఆపలేదని అనుకున్న సమయానికే పెళ్లి జరుగుతుందని తెలిపాడు. బయట పరిస్థితులు అనుకూలించకపోతే గుడిలోనైనా వివాహం చేసుకుంటానన్నారు. పెళ్లిని వాయిదా వేయడం తనకు ఇష్టం లేదని అన్నాడు.