బ్రేకింగ్; ఏపీ సిఎస్ రాజీనామా…?

-

ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు రాజకీయాలు అన్నీ కూడా స్థానిక సంస్థల ఎన్నికల చుట్టూనే తిరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు జరపాలని పట్టుదలగా ఉంది. ఎన్నికల సంఘం మాత్రం ఈ విషయంలో వెనక్కు తగ్గడం లేదు. కరోనా వైరస్ తీవ్రంగా ఉందని తాము ఎన్నికలను జరపలేమని ఎన్నికల సంఘం చెప్తుంది. మాకు తెలియకుండా నిర్ణయం తీసుకున్నారని రాష్ట్ర ప్రభుత్వం అంటుంది.

కేంద్రాన్ని అడిగి నిర్ణయం తీసుకున్నామని ఎన్నికల సంఘం అంటుంది. ఇక ఇక్కడ సిఎస్ నీలం సహాని తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఆమె ఎన్నికల సంఘం ప్రధాన అధికారికి లేఖ రాసారు. రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించాలని కరోనా వైరస్ లేదని ఆమె పేర్కొన్నారు. అయితే ఇప్పుడు దీనిపై ఎన్నికల సంఘం కోర్ట్ కి వెళ్ళే అవకాశాలు కనపడుతున్నాయి. తాము తీసుకున్న నిర్ణయాన్ని ఎందుకు తప్పుబడుతున్నారు అని ఎన్నికల సంఘం ఆగ్రహంగా ఉంది.

అదే విధంగా అధికారులను బదిలీ చేయమని చెప్పినా ఆమె చేయడం లేదు. పై నుంచి ఒత్తిడి ఎక్కువగా ఉన్న నేపధ్యంలో ఆమె ఇప్పుడు తీవ్ర ఒత్తిడిలో ఉన్నారని అంటున్నారు. అధికారులను బదిలీ చేయకపోవడం పై ఎన్నికల సంఘం గవర్నర్ ని కూడా కలిసే అవకాశాలు కనపడుతున్నాయి. దీనితో ఈ ఒత్తిడిని ఆమె భరించలేక ఇబ్బంది పడుతున్నారని, రాజీనామా చెయ్యాలని భావిస్తున్నారని ప్రచారం జరుగుతుంది.

ఆమె గత కొన్ని రోజులుగా రెవెన్యు శాఖ వ్యవహారాల విషయంలో కూడా తీవ్ర ఒత్తిడిలో ఉన్నారని కాబట్టి రాజీనామా చేసి బయటపడాలని చూస్తున్నారని అంటున్నారు. ఒకవేళ ఎన్నికల సంఘం కోర్ట్ కి వెళ్తే మాత్రం సిఎస్ ఇబ్బంది పడటం ఖాయం. కాగా ఇప్పటికే ఎన్నికలను నిర్వహించాలని ఏపీ సర్కార్ సుప్రీం కోర్ట్ కి వెళ్ళిన సంగతి తెలిసిందే. దీనితో మంగళవారం విచారణ జరుగుతుంది. మరి సుప్రీం కోర్ట్ ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version