ప్రభుత్వం భావించినట్టుగానే నిమ్మగడ్డ షాకింగ్ ప్రకటన చేశారు. ఈ నెలాఖరుతో తన పదవీ కాలం పూర్తవుతుండటంతో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను నిర్వహించలేనని ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కుండ బద్దలు కొట్టారు. కొద్ది రోజులుగా సెలవు మీద ఉన్న ఆయన ఈరోజు మాట్లాడుతూ ఈ నెల 31వ తేదీతో తన పదవీ కాలం పూర్తవుతుండటంతో బాధ్యతలు తన తదుపరి వచ్చే వారు నిర్వహిస్తారని చెప్పారు.
ఈ సమయంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయలేనని వివరించారు. రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ కూడా జరిగింది. ఈ సమయంలో ఎన్నికలు నిర్వహించలేమని ఎస్ఈసీ హైకోర్టుకు తెలిపింది.ఈ పరిస్థితుల నేపథ్యంలో పరిషత్ ఎన్నికలకు షెడ్యూల్ ఇవ్వలేమని ఎస్ఈసీ తేల్చి చెప్పింది. దీంతో ఈ కేసులో ఎన్నికలు నిర్వహించమని ఆదేశించమని చెప్పలేమని కోర్టు తీర్పు ఇచ్చింది.