ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇవాళ బాధ్యతలు చేపట్టనున్నారు. ఉదయం 11.15 గంటలకు ఆయన బాధ్యతలు చేపడతారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను పునర్నియమిస్తూ ఇటీవల పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ద్వివేదీ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ క్రమంలో ఇవాళ ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. కొన్ని నెలలపాటు పోరాడిన నిమ్మగడ్డ ఎట్టకేలకు ప్రభుత్వంపై విజయం సాధించారు.
హైకోర్టు చీవాట్లు, సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యల నేపథ్యంలో ఏపీ ఎన్నికల కమిషనర్ నియామకం విషయంలో జగన్ సర్కారు వెనక్కి తగ్గిన సంగతి తెలిసిందే. అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులో రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌లో వచ్చే తుది తీర్పునకు లోబడి పదవీ పునరుద్ధరణ నోటిఫికేషన్ ఉంటుందని తెలిపారు. అంతకుముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ను తొలగిస్తూ ఆర్డినెన్సును రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే.