జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత విజయసాయిరెడ్డి గారికి విశాఖపట్నంకి బాధ్యతలు ఇవ్వడం జరిగిందని, ఇప్పటికే 4 వేల ఎకరాల భూమిని విజయసాయిరెడ్డి గారు లాక్కోవడం జరిగిందని చినరాజప్పys విమర్శించారు. తూర్పుగోదావరి జిల్లా మీద విజయసాయి రెడ్డి గారి కన్ను జగన్మోహన్ రెడ్డిగారు కన్ను పడిందని ఆయన విమర్శించారు. తూర్పుగోదావరి జిల్లాలో 10 వేల ఎకరాలు భూమి విజయసాయి రెడ్డి గారు అనుచరులకు అరవిందో సంస్థకి ఇవ్వడం జరిగిందని ఆయన మండిపడ్డారు.
యనమల రామకృష్ణ గారు వాస్తవాలు చెబుతుంటే వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు గారు మసి పూసి మారేడు కాయ లాగా మాట్లాడుతున్నారని ఆయన ఆరోపణలు చేసారు. తెలుగుదేశం హయంలో చంద్రబాబు నాయుడు గారు రైతులకు అండగా నిలిచి వారి హక్కులను కాపాడడం జరిగిందని, ఈ ప్రభుత్వంలో నాయకులు మంత్రులు రైతులు భూములను లాక్కుని వాళ్ల అనుచరుల కి ఇవ్వడం జరుగుతుందని చెప్పుకొచ్చారు.